Vasudev Maiya's Death: గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ అనుమానాస్పద మరణం, కారులో వాసుదేవ్ మైయా మృతదేహం, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సుబ్రమణ్యపుర పోలీసులు

గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ వాసుదేవ్ మైయా అనుమానాస్పద రీతిలో (Vasudev Maiya's Death) మరణించాడు. ఈ మరణం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నగరంలోని తన ఇంటి వెలుపల పార్క్ చేసిన కారులో చనిపోయి కనిపించారు. దీనిపై కేసు నమోదు చేసిన సుబ్రమణ్యపుర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవు తున్నప్పటికీ, కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కాగా కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడుగా వాసుదేవ్ మైయా (Former Guru Raghavendra Bank CEO) ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Sri Guru Raghavendra Co-operative Bank (Photo Credits: IANS)

Bengaluru, July 7: గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈఓ వాసుదేవ్ మైయా అనుమానాస్పద రీతిలో (Vasudev Maiya's Death) మరణించాడు. ఈ మరణం ఇప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. సోమవారం సాయంత్రం నగరంలోని తన ఇంటి వెలుపల పార్క్ చేసిన కారులో చనిపోయి కనిపించారు. దీనిపై కేసు నమోదు చేసిన సుబ్రమణ్యపుర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవు తున్నప్పటికీ, కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కాగా కోట్ల రూపాయల బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడుగా వాసుదేవ్ మైయా (Former Guru Raghavendra Bank CEO) ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను రేప్ చేశాడు, 60 మంది పోలీసులను క్వారంటైన్‌కి పంపాడు, దేశంలో 7 లక్షలు దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య, దేశంలో కోటి దాటిన నిర్థారణ పరీక్షలు

2012-2018వరకు పదవీలో కొనసాగిన వాసుదేవ్ పైభారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్‌బీఐ (RBI) దర్యాప్తులో దాదాపు 1400 కోట్ల రూపాయల అవకతవకలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో అతనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రిజిస్ట్రార్‌ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ తదితర విభాగాలు మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేసాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జూన్ 18 న అవినీతి నిరోధక బ్యూరో (ACB) శ్రీ గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు చెందిన ఐదు కార్యాలయాలు, బ్యాంక్ చైర్మన్ కె రామకృష్ణ నివాసాల వద్ద కూడా శోధనలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో దర్యాప్తునకు భయపడిన వాసుదేవ్ మైయా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.

కాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 1400 కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలపై ఈ ఏడాది జనవరిలో దర్యాప్తు ప్రారంభించింది. ఆరు నెలల వరకు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రతి ఖాతాదారునికీ రూ. 35 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. ఈ ఆంక్షల నేపథ్యంలో.. కరోనా వైరస్ మహమ్మారి ఉన్నప్పటికీ వందలాది డిపాజిటర్లు గత నెలలో తమ సొమ్ము తీసుకునేందుకు ఈ బ్యాంకు బ్రాంచీల ముందు క్యూలు కట్టారు. ఆ తరువాత గత నెలలో ఈ పరిమితిని ఒక లక్ష రూపాయలకు పెంచింది.

వీరిలో అత్యధికులు సీనియర్ సిటిజన్లే ఉన్నారు.వాసుదేవ్ మయ్యా పై గత జనవరిలోనే చీటింగ్, ఫోర్జరీ కేసు దాఖలు కావడంతో ఆయనను సీఈఓ పదవి నుంచి తొలగించారు. బ్యాంకులో జరిగిన ఆర్ధిక అవకతవకలపై ఆర్ బీ ఐ ఓ అడ్మినిస్ట్రేటర్ ని కూడా నియమించింది. గత నెలలో వాసుదేవ్ ఇంటిపైన, కార్యాలయం పైన అధికారులు దాడులు నిర్వహించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Amit Shah Slams MK Stalin: సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే, ఈ సారి తమిళనాడులో వచ్చేది ఎన్టీఏ ప్రభుత్వమే, డీఎంకే సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Maha Shivaratri 2025 Wishes In Telugu: మహాశివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

Share Now