New Delhi, July 7: భారత్‌లో కోవిడ్-19 వైరస్ పాజిటివ్ కేసుల (India’s Coronavirus) సంఖ్య ఏడు లక్షలు దాటింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 22,252 కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 467 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (India's Coronavirus Tally) 7,19,665కి చేరుకున్నది. దీంట్లో 2,59,557 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,39,948 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవల్ చర్చలు
దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య (COVID-19 Deaths) 20,160గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో కోటి మందికిపైగా కరోనా పరీక్షలను నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వైరస్ మరణాల్లో భారత్ 8వ స్థానంలో ఉన్నది. ఢిల్లీలో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. కొత్త కేసుల కన్నా.. రివకర్ అయిన కేసుల సంఖ్య తక్కువగా ఉన్నది. కర్నాటకలోనూ 25వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
భారత్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సోమవారం వెల్లడించింది. ఆ రోజు ఉదయం 11 గంటల వరకు భారత్‌లో మొత్తం 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ లోకేష్ శర్మ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కరోనా అంటూ ఫేక్ వార్త, లోకల్ జర్నలిస్టుపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన #WhereIsKCR హ్యాష్ ట్యాగ్
దేశంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 1100 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 788 ప్రభుత్వ ల్యాబులు ఉండగా, 317 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 61, తెలంగాణలో 36 కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఇక కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలోనే మూడు స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి
ఇదిలా ఉంటే ఓ అత్యాచార నిందితుడికి కరోనా పాజిటివ్ తేలడంతో.. ఆ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించిన 60 మంది పోలీసులు క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. వివరాల్లోకెళితే.. ఓ అత్యాచారం కేసులో మైసూర్ కు చెందిన 28 ఏళ్ల యువకుడిని బిలాస్ పూర్ జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీసులు జులై 4న అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆ యువకుడిని అరెస్టు చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(మైసూరు యూనిట్)లో నిందితుడు పని చేస్తున్నాడు.
అరెస్టు చేసిన అనంతరం నిందితుడిని జైలుకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో సివిల్ లైన్స్ పోలీసులకు సమాచారం అందించడంతో.. 60 మంది పోలీసులు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. పోలీసులందరి నమూనాలను వైద్యులు సేకరించారు. రేపోమాపో వారి ఫలితాలు రానున్నాయి.
ఇక కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఢిల్లీలో ఓ జర్నలిస్ట్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఢిల్లీలో ఓ ప్రముఖ దినపత్రికలో విధులు నిర్వర్తిస్తున్న తరుణ్ సిసోడియాకు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది వెంటనే గమనించి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందారు. తరుణ్ సమీప వ్యక్తుల సమాచారం ప్రకారం.. వైరస్ బారినపడటంతో ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది.