India China Standoff: చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ చర్చలు
Ladakh sector of LAC | (Photo Credits: AFP)

New Delhi, July 6: భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మక పాయింట్ కు అత్యంత కీలకమైన గల్వాన్‌ లోయ నుంచి చైనా బలగాలు (China Begins De-Escalation) వెనక్కి వెళ్లాయి. గల్వాన్‌ లోయ (Galwan Valley), సహా హాట్‌స్ప్రింగ్స్‌, లద్దాఖ్‌ ప్రాంతాల నుంచి నుంచి చైనా బలగాలు దాదాపు కిలోమీటరున్నర మేర వెనక్కి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూడా తొలగిస్తున్నట్ల పేర్కొన్నాయి. ఇందుకు ప్రతిగా భారత బలగాలు కూడా వెనక్కి మళ్లాయని.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ‘బఫర్‌ జోన్‌’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించాయి. భారత్ బలమేంటో ప్రపంచానికి తెలుసు, లడఖ్‌ భారత్‌లో అంతర్భాగమే, సైనికులను చూసి దేశం గర్వపడుతోంది, బార్డర్లో సైనికుల్లో ఉత్తేజాన్ని నింపిన ప్రధాని నరేంద్ర మోదీ

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ (Galwan Valley in Ladakh) ప్రాంతంలోని భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద అక్రమంగా వేసిన గుడారాన్ని తొలగించమని భారత సైనికులు సూచించగా.. చైనా ఆర్మీ జూన్‌ 15న దాడికి తెగబడిన విషయం తెలిసిందే. రాళ్లు, ఇనుప రాడ్లను ఉపయోగించి భారత సైనికులను దొంగదెబ్బ కొట్టారు. ఈ ఘర్షణల్లో (India China Standoff) 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్- చైనా మధ్య వివిధ స్థాయిల్లో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. చైనా ట్విట్టర్‌ను మూసేసిన ప్రధాని మోదీ, వీబోలో పాత పోస్టులను డిలీట్ చేస్తున్న అధికారులు, అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడానికి సమయం పట్టే అవకాశం

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపారు. గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన సైనికుల త్యాగాలను కొనియాడుతూనే.. విస్తరణ వాదానికి కాలం చెల్లిందంటూ చైనాను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇక సరిహద్దుల్లో చైనా తీరును విమర్శించిన అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ తదితర దేశాలు భారత్‌ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ల‌డ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు ఉన్న నేప‌థ్యంలో.. భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుడు అజిత్ ధోవ‌ల్‌.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఫోన్‌లో మాట్లాడారు.

Here's ANI Tweet

ఆదివారం ఇద్ద‌రూ వీడియో కాల్ ద్వారా స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌పై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే చ‌ర్చ‌లు చాలా సానుకూలంగా సాగిన‌ట్లు అధికారులు తెలిపారు. స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించాల‌న్న నేప‌థ్యంలో ఇద్ద‌రూ సంభాషించారు. సంపూర్ణ స్థాయిలో శాంతి, సామ‌ర‌స్యం విల‌సిల్లాల‌న్న ల‌క్ష్యంతో చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ మాట్లాడారు. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ గాల్వ‌న్ లాంటి ఘ‌ర్ష‌ణ‌లు పున‌రావృత్తం కాకూడ‌ద‌ని ఇద్ద‌రూ చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం.

రెండు దేశాల సైన్యాలు వివాదాస్ప‌ద ప్రాంతం నుంచి వైదొలుగుతున్న‌ట్లు ఇవాళ‌ చైనా విదేశాంగ ప్ర‌తినిధి జావో లిజియాన్ కూడా తెలిపారు. ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు.. ఫ్రంట్‌లైన్ ద‌ళాల‌ను ఉప‌సంహ‌రించ‌డానికి కావాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మూడ‌వ‌సారి జ‌రిగిన క‌మాండ‌ర్ స్థాయి చ‌ర్చ‌ల్లో కుదిరిన ఒప్పందాల ప్ర‌కారం ద‌ళాల ఉప‌సంహ‌ర‌ణ జ‌రుగుతున్న‌ట్లు జావో లిజియాన్ తెలిపారు.

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్

కాగా భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పూనుకుంటుందని తాము భావించడం లేదన్నారు. అయితే తూర్పు లదాఖ్‌లోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జమ్మూ కశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులను పంపేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

గల్వాన్‌ లోయలో భారత్‌- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్‌ భారీగా సైన్యాన్ని మోహరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన శ్రీనగర్‌ కార్స్ప్‌ కమాండర్‌ బీఎస్‌ రాజు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.

‘‘ఇప్పటి వరకైతే సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం కదలికల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. అయితే డిఫెన్స్‌ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా వాళ్లకు ధీటుగా జవాబిచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉంది. దాదాపు 300 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు ఎదురుచూస్తున్నారనే సమాచారం ఉంది.

వాళ్లను పట్టుకునేందుకు మా సైనికులు సిద్ధంగానే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దుస్సాహసానికి పాల్పడకుండా 15 కార్స్స్‌ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది’’ అని తెలిపారు. ఇక మే నెలలో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది రియాజ్‌ నైకూను భారత్‌ మట్టుబెట్టడం గురించి ఆయన మాట్లాడుతూ.. హిజ్బూల్‌ ముజాహిద్దీన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని, హిజ్బుల్‌తో పాటు వివిధ ఉగ్రసంస్థలు కూడా నైకూను మిస్సవుతాయని పేర్కొన్నారు