PM Modi Speech in Ladakh (Photo-ANI)

New Delhi, July 3: భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదం (India-China border tensions) నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి సైనికుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ (PM Modi Speech in Ladakh) పరోక్షంగా చైనాపై విరుచుకుపడ్డారు. బ‌ల‌హీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించ‌ర‌ని, శాంతి కావాలంటే ధైర్యం చాలా ముఖ్య‌మైంద‌ని ప్ర‌ధాని అన్నారు. భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే

ప్ర‌పంచ యుద్ధాల స‌మ‌యంలోనైనా, శాంతి స‌మ‌యంలోనైనా (Peace And Humanity), అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న సైనికుల ధైర్యాన్ని ప్ర‌పంచం చూసింద‌ని, శాంతి కోసం కూడా మ‌న సైనికులు ( Indian soldiers) ప‌నిచేశార‌ని మోదీ అన్నారు. ఉత్త‌మ‌మైన మా‌నవ విలువ‌ల కోసం మ‌నం ప‌నిచేశామ‌ని ప్ర‌ధాని తెలిపారు.

విస్తరణ కాంక్షకు కాలం చెల్లిందని, ఇది అభివృద్ధి యుగమని డ్రాగన్ కంట్రీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. విస్తరణవాదులు ఓడిపోయి తోకముడిచిన ఘటనలు చరిత్రలో చోటుచేసుకున్నాయని అన్నారు. బలహీనులే శాంతి కోసం చొరవచూపరని ధైర్యవంతులే శాంతి కోసం పాటుపడతారని వ్యాఖ్యానించారు. భారత్‌ బలమేంటో ప్రపంచానికి తెలుసునన్నారు భారత్‌లో లడఖ్‌ అంతర్భాగమని స్పష్టం చేశారు.

Here;s ANI Tweet

Here's PM Speech in Ladakh

కష్టసమయంలో మనం పోరాటం చేస్తున్నామని విపత్కర పరిస్థితుల్లో జవాన్లు దేశానికి రక్షణగా ఉన్నారని అన్నారు. శత్రువులకు భారత సైనికులు గట్టి గుణపాఠం చెప్పారని ప్రశంసించారు. మీ కసిని పోరాట పటిమను ప్రత్యర్ధులకు రుచిచూపించారని అన్నారు. లడఖ్‌ నుంచి కార్గిల్‌ వరకూ మీ ధైర్యం అమోఘమని సైనికులను ప్రశంసించారు. దేశమంతా సైనికులను చూసి స్ఫూర్తి పొందుతోందని అన్నారు. మీ చేతుల్లో దేశం భద్రంగా ఉంటుందని, మీ త్యాగాలను దేశం మరువదని జవాన్ల సేవలను కొనియాడారు. సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం నిశ్చింతంగా ఉందని అన్నారు. మన సైనికులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు.

Here's PM Modi Speech

వేణువును వాయించిన కృష్ణ భ‌గ‌వానుడిని పూజించామ‌ని, అలాగే సుద‌ర్శ‌న చ‌క్రాన్ని వాడిన ఆ భ‌వంతుడినే మ‌నం పూజించామ‌ని తెలిపారు. సామ్రాజ్య విస్త‌ర‌ణ యుగం ముగిసింద‌ని, ఇప్పుడు అభివృద్ధి యుగంలో ఉన్నామ‌న్నారు. సామ్రాజ్య‌కాంక్ష ఉన్న దేశాలు చ‌రిత్ర‌లో కొట్టుకుపోయాయ‌ని, అలాంటి దేశాలు వెన‌క్కి తిరిగి వెళ్లిపోయాయ‌న్నారు. వికాస‌వాదుల‌కు ప్ర‌పంచ‌దేశాలు స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని మోదీ అన్నారు.

PM Modi met soldiers who were injured in GalwanValleyClash

కాగా ప్రధానమంత్రి మోదీ అంతకుముందు గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో గాయపడిన భాఇరత జవాన్లను సైనిక స్ధావరం నిములో పరామర్శించారు. సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా కమాండర్‌ స్ధాయి సమావేశాల్లో పాల్గొన్న సైనికాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గల్వాన్‌ ఘటనపై స్ధానిక జవాన్లను అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందన

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. మోదీ ప‌ర్య‌ట‌న భార‌త సైన్యంలో మ‌రింత ఆత్మ‌స్థైర్యాన్ని పెంచుతుంద‌న్నారు. భార‌త సైన్యం నీడ‌లో దేశ స‌రిహ‌ద్దులు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉంటాయన్న రాజ్‌నాథ్..ల‌డ‌ఖ్‌లో మోదీ సంద‌ర్శించ‌డంతో ప్ర‌తీ సైనికుడి ఆత్మ‌స్థైర్యం మ‌రింత రెట్టింప‌య్యింద‌న్నారు. మోదీ చ‌ర్య‌ను స్వాగ‌తిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేర‌కు రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. చైనాతో కొన‌సాగుతున్న ప్ర‌తిష్టంభ‌న నేప‌థ్యంలో అక్క‌డి ప‌రిస్థితుల‌పై స‌మీక్షించేందుకు రాజ్‌నాథ్ ల‌డ‌ఖ్ వెళ్లాల్సి ఉండ‌గా అనూహ్యంగా ఆ ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌య్యింది.

దేశానికి లడక్ శిరస్సు వంటింది : ప్రధాని మోదీ

14కార్ప్స్ ద‌ళాలు చూపిన తెగువ‌ను ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటార‌న్నారు. మీరు ప్ర‌ద‌ర్శించిన ధైర్య‌సాహాసాలు ప్ర‌తి ఒకరి ఇంట్లో ప్ర‌తిధ్వ‌నిస్తున్నాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. మీలోని అగ్నిని, ఆవేశాన్ని.. భార‌తమాత శ‌త్రువులు చూశార‌న్నారు. లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని విడగొట్టేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు జరిపినా తిప్పికొడుతూ వచ్చారని ప్రధాని గుర్తుచేశారు. 'దేశానికి లడక్ శిరస్సు వంటింది. 130 కోట్ల మంది భారత ప్రజలకు గర్వకారణం. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడే వారికే ఈ భూమి సొంతం. ఈ ప్రాంతాన్ని వేరుచేసేందుకు జరిపే ఎలాంటి ప్రయత్నాన్నైనా జాతీయభావాలు పుష్కలంగా ఉన్న లడక్ ప్రజలు తిప్పికొడతారు' అని మోదీ స్పష్టం చేశారు.

నరేంద్ర మోదీ లడఖ్‌ పర్యటనపై చైనా ఘాటు స్పందన

ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌ పర్యటనపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.