PM Narendra Modi in Leh: భారత సైనికుల మధ్య అనూహ్యంగా ప్రధాని మోదీ, సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో లడఖ్‌లో మోదీ ఆకస్మిక పర్యటన, ప్రధాని వెంట బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవణే
PM Narendra Modi in Leh (Photo-ANI)

New Delhi, July 3: భారత్‌-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లడఖ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. శుక్రవారం ఉదయం సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి లేహ్‌కు (PM Narendra Modi in Leh) చేరుకున్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయనే స్వయంగా లడక్‌లో పర్యటిస్తున్నారు. త్రిదళాధిపతి బిపిన్ రావత్ (CDS General Bipin Rawat), ఆర్మీ చీఫ్ నరవణేతో (Naravane) కలిసి ఆయన లడక్ వెళ్లారు. సరిహద్దులో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు, 33 యుద్ధ విమానాలు కొనుగోలుకు భారత్ పచ్చజెండా, హోంమంత్రి లద్దాఖ్ పర్యటన రద్దు

నీములో ప్రధానికి లెఫ్టెనెంట్ జనరల్ హరీందర్ సింగ్ అన్ని వివరాలు తెలిపారు. భారత సైన్యం తరపున హరిందర్ సింగ్ చర్చలు జరుపుతున్నారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో సింధు నది జన్మస్థానం వద్ద ఈ సమావేశం (PM Narendra Modi arrives in Leh) జరుగుతోంది. జూన్ 15న చైనా బలగాల దాడిలో గాయపడి లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను మోదీ పరామర్శించనున్నారు.

PM Modi lands in Leh

ప్రధాని మోదీ కూడా సైనిక దుస్తుల్లోనే జవాన్లతో భేటీ అయ్యారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెల్యూట్ చేసి, వారి భుజాలు తడుతూ అభినందించారు. కరోనా భయాలను పక్కనబెట్టి, జవాన్లతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జవాన్లంతా జై హింద్ అని నినాదాలు చేస్తుంటే, మోదీ (Prime Minister Narendra Modi) కూడా వారితో కలిసి భరతమాతకు జైకొట్టారు.

ఈ పర్యటన సందర్భంగా సరిహద్దు ప్రతిష్టంభనపై (India-China Border Standoff) సైనికాధికారులతో, టాప్‌ కమాండర్లతోనూ ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో తాజా పరిస్థితిని సైనికులను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో భారత్‌కు చెందిన 20 మందిసైనికులు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. ఈ దాడిలో గాయపడ్డ సైనికులను సైతం మోదీ పరామర్శించనున్నారు. సైనికులకు భరోసా ఇవ్వడం, చైనాకు గట్టి సందేశం ఇవ్వడంలో భాగంగానే ప్రధాని పర్యటించినట్లు తెలుస్తోంది. ఇక ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని మోదీ లద్దాఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.కాగా,

చైనా మిలిట‌రీ అధికారుల‌తో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల ప్ర‌క్రియ‌ను కూడా ఆయ‌న అడిగి తెలుసుకోనున్నారు. వాస్త‌వానికి ఇవాళ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. కానీ ఆయ‌న షెడ్యూల్‌ను మార్చేశారు. దీంతో ఇవాళ ఉద‌యం మోదీ .. ల‌డ‌ఖ్ చేరుకున్నారు. ప్ర‌ధాని మోదీ వెంట‌.. త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్‌తో పాటు ఆర్మీ చీఫ్ న‌ర‌వాణే ఉన్నారు. సాధారణంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్ సరిహద్దు ప్రాంతాలకు ప్రముఖలు పెద్దగా వెళ్లరు. కానీ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఈ విషయంలో ముందడుగు వేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆ వెంటనే ఆకస్మికంగా లడక్‌లో ల్యాండ్ అయ్యారు.