New Delhi, July 2: చైనాతో సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో (India-China Face Off) భారత్ భారీ ఎత్తున ఆయుధ సమీకరణ చేపడుతోంది. తాజాగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రాన్స్ నుంచి అదనంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోరుతున్న భారత్, తాజాగా రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని (India To Buy 33 Fighter Jets) నిర్ణయించింది. ఇటు, దేశీయంగా తయారైన ఆయుధ వ్యవస్థలను కూడా అమ్ములపొదిలో చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (Defence Ministry) పచ్చ జెండా ఊపింది. రూ.38,900 కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలు, రక్షణ వ్యవస్థల కొనుగోళ్లకు ఆమోదం తెలిపింది. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని
రష్యా నుంచి మిగ్-29 ఫైటర్ జెట్ విమానాలు 21, ఎస్ యు-30 ఎంకేఐ ( Su-30MKI) యుద్ధ విమానాలు 12 కొనుగోలు చేయనున్నారు. అంతేకాదు, ఇప్పటికే భారత వాయుసేనలో కొనసాగుతున్న 59 మిగ్-29 విమానాలను ఆధునికీకరించే ప్రతిపాదనకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం అస్త్ర మిసైళ్లను కూడా కొనుగోలు చేయనున్నారు. ఇవి డీఆర్డీవో అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో దేశీయంగా తయారయ్యాయి.
Here's ANI Tweet
Defence Ministry approves proposal to acquire 33 new fighter aircraft from Russia including 12 Su-30MKIs and 21 MiG-29s along with upgradation of 59 existing MiG-29s. The total cost of these projects would be Rs 18,148 crores: Defence Ministry pic.twitter.com/nMvZvBn37Y
— ANI (@ANI) July 2, 2020
రష్యా నుంచి ఎంఐజీ-29 యుద్ధవిమానాల కొనుగోలు (33 New Fighter Aircraft), ఆధునీకరణకు 7400 కోట్ల రూపాయలు వెచ్చించనుండగా,10,700 కోట్ల రూపాయలతో 12 సుఖోయ్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయనుంది. యుద్ధ విమానాల కొనుగోలు, ఆధునీకరణ చేపట్టాలని చాలాకాలంగా భారత వాయుసేన (ఐఏఎఫ్) కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో 38,900 కోట్ల విలువైన ఆయుధసామాగ్రి, రక్షణ పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. వీటిలో 31,130 కోట్ల విలువైన సామాగ్రిని భారత పరిశ్రమల నుంచి సమీకరిస్తారు.
ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా 31,130 కోట్ల రూపాయలు దేశీయంగా తయారయ్యే ఆయుధాల కోసం కేటాయిస్తారు. త్రివిధ దళాలకు ఉపయోగపడే ఆయుధాలు, క్షిపణులు డీఆర్‌డీఓలో తయారౌతున్నాయి. హెచ్‌ఏఎల్‌లో యుద్ధ విమానాలు తయౌరౌతున్నాయి. భారత్‌లో తయారీకి రష్యా అంగీకరించింది. అన్ని విధాలా సహకరిస్తోంది. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నప్పటి నుంచీ భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.
ఉద్రిక్తతలు తగ్గించేందుకు యత్నాలు కొనసాగుతున్నా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారత్‌కన్నా ఆరు రెట్లు బలగాలను మోహరించింది. దీంతో ఎల్‌ఏసీ వెంబడి 3500 కిలోమీటర్ల వరకూ భారత్ నిఘా పెంచింది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అమెరికాల నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను, క్షిపణి రక్షక వ్యవస్థలను భారత్ కొనుగోలు చేస్తోంది. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
ఇదిలా ఉంటే రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శుక్రవారం లద్ధాఖ్‌కు వెళ్లాల్సి ఉన్నది. అయితే ఆ పర్యటనను రద్దు చేశారు. లేహ్‌కు వెళ్లాల్సిన మంత్రి .. అక్కడ సైనిక సంసిద్ధతను పరిశీలించాల్సి ఉంది. ఫార్వర్డ్ లొకేషన్లను కూడా రాజ్‌నాథ్ విజిట్ చేస్తారని ముందుగా తెలిపారు. లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికుల్ని కూడా ఆయన కలవాల్సి ఉన్నది. కానీ అకస్మాత్తుగా రాజ్‌నాథ్ పర్యటనను రద్దు చేశారు. ఎందుకు రక్షణ మంత్రి షెడ్యూల్‌ను మార్చారన్న దానిపై క్లారిటీ లేదు. సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల ప్రకారం జరిగిన ఒప్పందాలను చైనా ఎలా అమలు చేస్తుందో చూడాలని భారత్ ఓపికగా ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 6, 22, 30వ తేదీల్లో సైనికాధికారుల మధ్య సమావేశాలు జరిగాయి. వాస్తవానికి ఫార్వర్డ్ పోస్టుల వద్దకు రక్షణ మంత్రి వస్తే, అది మనోధైర్యాన్ని ఇస్తుందని, ఇది ఒకరకంగా శత్రువులకు సంకేతమని, మేం మా ప్రాంతాలను వదలడం లేదని ఓ సైనికాధికారి వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా సుమారు 20 వేల దళాలను మోహరించినట్లు తెలుస్తోంది. అయితే చైనా తన ఒప్పందానికి ఎంత వరకు కట్టుబడి ఉందో తెలుసుకోవడానికి వేచి చూస్తున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం
చైనాతో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని పురస్కరించుకుని చేసిన విక్టరీ డే ఉత్సవాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడంపై అభినందనలు తెలిపారు. అదే సమయంలో మరో 16 సంవత్సరాల పాటు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉండేలా తాజాగా చేసిన రాజ్యాంగ సవరణ ఆమోదం పొందడంపై కూడా మోదీ పుతిన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు
మాస్కోలో ఇటీవల జరిగిన మిలిటరీ పరేడ్‌లో భారత త్రివిధ దళాలు పాల్గొన్న విషయంపై ఇద్దరు నేతలూ మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పటిష్టమైన బంధానికిది నిదర్శనమన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పరస్పరం అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న రష్యా-భారత్ ద్వైపాక్షిక సమావేశానికి రావాలని ప్రధాని మోదీ పుతిన్‌కు ఆహ్వానం పలికారు.
తనకు ఫోన్ చేసి అభినందనలు తెలపడంపై పుతిన్ మోదీకి ధన్యవాదాలు చెప్పారు. భారత్‌కు తామెప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. 2036 వరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 83 ఏళ్ల వయసు వచ్చేవరకూ పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉంటారు. మరోవైపు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి రష్యా నుంచి 33 యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే నేపాల్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను చైనా, పాకిస్తాన్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హిమాలయ ప్రాంతంలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు భారీ కుట్రకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. నేపాల్ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇండియా మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నవిషయం దీనికి మరింతగా బలాన్నిస్తోంది. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలే ఆయనను విమర్శిస్తూ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందిగా పట్టుబట్టారు.
నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితులు నెలకొనడంతో.. చైనా తన గూఢాచారులను అక్కడ మోహరించినట్లు భారత భద్రతా సంస్థలు వెల్లడించాయి. ఓలికి మద్దతుగా నిలిచే క్రమంలో కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వైద్య సహాయం పేరిట డ్రాగన్ ఇప్పటికే తన వేగులను నేపాల్‌కు పంపించినట్లు పేర్కొన్నాయి.
ఓవైపు భారత్, చైనా లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుపుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ గిల్గిట్-బల్టిస్థాన్‌లో తన సైన్యాన్ని సమీకరిస్తోంది. ఆర్మీ వర్గాల సమాచారం ప్రకారం.. చైనాకు మద్దతుగా ఇప్పటికే 20వేలమంది బలగాలను ఉత్తర లద్దాఖ్‌కు తరలించింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు గాను పాకిస్థాన్‌కు చెందిన అల్ బదర్ ఉగ్రసంస్థతో చైనా సైన్యం సంప్రదింపులు జరుపుతోంది.
మంగళవారం జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలో, పరస్పర అంగీకారమైన పరిష్కారానికి వచ్చేందుకై సైనికపరంగా, దౌత్యపరంగా పలు సమావేశాలు జరగాలని నిర్ణయించాయి. భారత్‌లోని చుల్‌షుల్ సెక్టార్‌లో ఉదయం 11గంటలకు మొదలైన చర్చలు, సుదీర్ఘంగా 12గంటల పాటు సాగాయి. భారత్ తరపున 14కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా.. చైనా తరపున టిబెట్ మిలిటరీ జిల్లా కమాండర్ మేజర్ జనరల్ లియూ లిన్ పాల్గొన్నారు.