Sukhoi-30MKI: గగనతలంలో దుమ్మురేపుతోన్న సుఖోయ్, సుఖోయ్ యుద్ధ విన్యాసాల వీడియోను ట్వీట్ చేసిన ఐఏఎఫ్, 87వ వార్షికోత్సవానికి వైమానిక దళం సన్నాహాలు
Sukhoi-30MKI performs vertical Charlie maneuver during Air Force Day rehearsal ( Photo-ANI)

New Delhi, October 6:  సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గగనతలంలో దుమ్మురేపుతోంది. ఈ యుధ్ద విమానంతో భారత వైమానిక దళం చేపట్టిన గగన విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ లోని హింద్ వైమానిక స్థావరంలో ఎయిర్ మార్షల్ ఛీప్ ఆర్‌కెఎస్ భదౌరియా సెల్యూట్ గా ఈ విన్యాసం చేపట్టినట్లు ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది.

దీనికి సంబంధించిన వీడియోను వైమానికిదళం ట్విట్టర్లో ట్వీట్ చేసింది. గాల్లో ఎగురుతూ పలు రకాల ఫీట్లు చేసిన సుఖోయ్ 30 యుద్ద విమానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో ట్రెండ్ అవుతోంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సుఖోయ్ 30 యుద్ద విమాన విన్యాసాలు

భారత వైమానిక దళం 87వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఎయిర్ ఫోర్స్ అధికారులు వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. హిందన్ స్థావరం కేంద్రంగా వివిధ రకాల యుద్ద విమానాలతో వైవిధ్య భరితమైన విన్యాసాలతో ప్రదర్శన నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు మరో రెండు రోజుల్లో గగన తలంలో ఈ విన్యాసాలు వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఆ క్రమంలో గెట్ రెడీ అంటూ భారత వైమానిక దళం ట్వీట్ చేయడం విశేషం. అయితే దీనికి సంబంధించిన ప్రొమో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు

సుఖోయ్ 30 యుద్ద విమాన విన్యాసాల పుల్ వీడియో

ఈ విన్యాస ప్రదర్శనలో వింటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ లు , ఆధునిక రవాణా విమానాలు, ఫైటర్ జెట్ లు పాల్గొని విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఐఏఎఫ్ లోని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ సారంగ్ హెలికాఫ్టర్ టీమ్ చేసే విన్యాసాలు దుమ్మురేపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ విన్యాసాలతోనే ప్రదర్శన ముగియనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెల్లడించింది.