Karnataka Shocker: ఒకే ఇంట్లో నాలుగు శవాలు, విగతజీవులుగా పడి ఉన్న కుటుంబం, రెండు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని పోలీసుల అనుమానం, ఇంతకీ హత్యా? ఆత్మహత్యా?
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగు చూసింది. మైసూరు పరిధిలోని చామండిపురానికి చెందిన మహాదేవస్వామి(45) తన భార్య అనిత(38), కూతుళ్లు చంద్రకళ(17), ధనలక్ష్మి(15)తో కలిసి ఉంటున్నాడు.
Mysuru, AUG 27: కర్ణాటకలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం వెలుగు చూసింది. మైసూరు పరిధిలోని చామండిపురానికి చెందిన మహాదేవస్వామి(45) తన భార్య అనిత(38), కూతుళ్లు చంద్రకళ(17), ధనలక్ష్మి(15)తో కలిసి ఉంటున్నాడు. మహాదేవస్వామి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మహాదేవస్వామి ఉంటున్న ఇంటి తలుపులు రెండు రోజుల నుంచి తెరవకపోవడంతో.. స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తెరిచి చూడగా, నలుగురు కూడా చనిపోయి (Found Dead Suicide) ఉన్నారు. చంద్రకళ ఉరేసుకుని ఉండగా, మిగతా ముగ్గురు కిందపడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహాదేవస్వామి ఈ ఇంట్లో గత రెండు నెలల నుంచి కిరాయికి ఉంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.