Karnataka Coronavirus: కరోనా ఎఫెక్ట్, నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి , కర్ణాటకలో జర్నలిస్టుకి కోవిడ్-19, ఇప్పటికే స్వీయ నిర్భంధంలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని

అక్కడ తాజాగా ఒక జ‌ర్న‌లిస్టుకు (Journalist) క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో ఇటీవ‌ల ఆ జ‌ర్న‌లిస్టు ఎవ‌రెవ‌రిని క‌లిశారో వారంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. జ‌ర్న‌లిస్టు క‌లిసిన‌ వారిలో ఆ రాష్ట్రానికి చెందిన న‌లుగురు మంత్రులు (Karnataka Ministers) కూడా ఉండ‌టంతో వారంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో ఆ రాష్ర్ట ఉప ముఖ్య‌మంత్రి కూడా ఉన్నారు.

Coronavirus Cases In India. | File Photo

Bengaluru, Apr 30: కర్ణాటకలో కరోనావైరస్ (Karnataka Coronavirus) చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడ తాజాగా ఒక జ‌ర్న‌లిస్టుకు (Journalist) క‌రోనా పాజిటివ్‌గా తేలడంతో ఇటీవ‌ల ఆ జ‌ర్న‌లిస్టు ఎవ‌రెవ‌రిని క‌లిశారో వారంద‌రినీ క్వారెంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. జ‌ర్న‌లిస్టు క‌లిసిన‌ వారిలో ఆ రాష్ట్రానికి చెందిన న‌లుగురు మంత్రులు (Karnataka Ministers) కూడా ఉండ‌టంతో వారంతా ఇప్పుడు సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. ఇండియాలో ఆగని కరోనా ఘోష, 33 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు, తమిళనాడులో 121మంది పిల్లలకు కరోనా పాజిటివ్

వీరిలో ఆ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కూడా ఉన్నారు. ఈ నెల 24న కర్ణాట‌క‌కే చెందిన టీవీ వీడియో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఆయన ఏప్రిల్ 21 నుంచి 24 మధ్య వివిధ శాఖల మంత్రులను కలిశారు.

దీంతో వారంద‌రూ సెల్ఫ్ ఐసోలేష‌న్‌కు వెళ్ల‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ (Twitter) వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఈ జాబితాలో ఉప ముఖ్య‌మంత్రి అశ్వ‌త్ నారాయ‌ణ్‌, హోంమంత్రి బస్వరాజ్ బొమ్మాయి, వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక శాఖ మంత్రి సిటి రవి ఉన్నారు.

కోవిడ్ ప‌రీక్ష‌లో నెగిటివ్ అని తేలింద‌ని, అయిన‌ప్పటికీ ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా తామంతా క్వారంటైన్‌లోకి వెళ్తున్నామ‌ని న‌లుగురు మంత్రులు తెలిపారు. వీడియో జ‌ర్న‌లిస్టు కుటుంబ స‌భ్యుల‌తో పాటు అత‌ను స‌న్నిహితంగా మెలిగిన ఇత‌ర మీడియా సంస్థ‌ల జ‌ర్న‌లిస్టులు స‌హా 40 మందిని క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును ఆపలేం, స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు 532 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, వారిలో 215 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ వైర‌స్ ధాటికి రాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 20 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వెల్ల‌డించింది. గురువారం వైర‌స్ ప్ర‌భావితం పెద్ద‌గా లేని ప్రాంతాల్లో కొన్ని ష‌రతుల‌తో ప‌రిశ్ర‌మ‌లు తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది.

ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన ఓ జ‌ర్న‌లిస్టుకు కోవిడ్ పాజిటివ్ అని తేల‌డంతో త‌న‌ను తాను సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు గుజ‌రాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (Gujarat Chief Minister Vijay Rupani) ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనావైరస్ పాజిటివ్‌ అని తేలడంతో ఆయన్ని కలిసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా కోవిడ్ -19 పరీక్ష చేయించుకున్న రూపానీ తనకు తాను నిర్బంధించుకున్నారు. దీంతో ఇంటి నుండే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాలన సాగిస్తారని అధికారులు తెలిపారు.

అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఓం ప్రకాష్ మచ్రా ధృవీకరించారు. ఇమ్రాన్‌.. గాంధీ నగర్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంతో పాటు మరికొందరిని కూడా కలిశారు. వీరిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు కూడా ప్రస్తుతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.



సంబంధిత వార్తలు