Indian Parliament (Photo credits: Wikimedia Commons)

New Delhi, April 30: ఢిల్లీలోని లుటియెన్స్‌ జోన్‌లో (Lutyens Delhi) కొత్త పార్లమెంట్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించే సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును (Central Vista Project) నిలిపివేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రస్తుతానికైతే ఆపడం సాధ్యం కాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ ప్రాజెక్టు కొరకు జారీ చేసిన భూవినియోగం మార్పు నోటిపికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. కరోనా వైరస్‌(COVID-19) వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూవినియోగం మార్పు చేయాలనే వాదన అత్యవసరం కాదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే (Chief Justice SA Bobde & Aniruddha Bose) స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలకు అనుగణమైన నూతన పార్లమెంటు, మంత్రిత్వ శాఖలకు విశాలమైన కేంద్ర సెక్రటేరియట్, ప్రధాని, ఉపరాష్ట్రపతి కొరకు నూతన నివాస భవనాలు మొదలైనవాటితో కూడిన భారీ ప్రాజెక్టునే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా అని పిలుస్తున్నది. 2024లో పూర్తయ్యే ఈ విస్టా ప్రాజెక్టుకు కేంద్రం రూ.20,000 కోట్లు కేటాయించింది. ఇండియాలో ఆగని కరోనా ఘోష, 33 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు, తమిళనాడులో 121మంది పిల్లలకు కరోనా పాజిటివ్

ఈ కేటాయింపును రద్దు చేసి కరోనా అవసరాలకు ఆ సొమ్మును మళ్లించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్రమోదీకి రాసిన ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రస్తుత భవనంలో సౌకర్యవంతంగా తన పనిని కొనసాగించవచ్చని, కొత్త భవనాల నిర్మాణం తక్షణ అవసరం ఏమీ కాదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంత సొమ్ము ఖర్చు చేయడం దుబారా అవుతుందని సోనియా తన లేఖలో తెలిపారు. ఎంపీలాడ్స్ నిదులను నిలిపివేసి ఆ సొమ్మును కరోనాకు మళ్లిస్తున్న కేంద్రం మరోవైపు సెంటర్ల విస్టా ప్రాజెక్టుకు రూ.20,000 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నదని తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా కూడా దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో బస్సుల పునరుద్ధరణపై వారం రోజుల్లో స్పందన తెలపండి, కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు, వలస కార్మికుల సమస్యలపై పిటిషన్ విచారణ

ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం భూ వినియోగ మార్పిడి చేస్తూ రీ డెవలప్‌మెంట్‌ ప్లాన్ చేసింది. కేంద్రం చేసిన భూ వినియోగ మార్పిడిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బాబ్డే, జస్టిస్ అనిరుద్ద బోస్‌ల ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చెపట్టింది.కరోనా భయం, సుప్రీంకోర్టు పాక్షిక మూసివేత, కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ, లాయర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుకు హాజరుకావాలి, ఆదేశాలు జారీ చేసిన సీజే

ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్‌ను నిర్మిస్తున్నప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. పిటిషనర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు కొత్త పార్లమెంటు నిర్మాణం ప్రాజెక్టుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.  షెడ్యూల్డ్ ప్రాంతాల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదు, తెలుగు రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీంకోర్టు, అప్పటి నియామకాల్లో జోక్యం చేసుకోబోమంటూ వెల్లడి

ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ గత డిసెంబర్‌లో సౌత్ బ్లాక్ సమీపంలో డల్‌హౌసీ రోడ్డుపై ప్రధాని నూతన నివాసం నిర్మాణం కొరకు 15 ఎకరాల స్థలవినియోగాన్ని వినోద అవసరాల నుంచి నివాస అవసరాలకు మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశం కరోనా కల్లోలం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లడం భావ్యం కాదని విపక్షాలు అంటున్నాయి.