Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..
హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.
విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు. తాము కూడా డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ గడుపుతామనిచెప్పి వెళ్లిపోయారు.
ఇళ్లు, కార్లు కొన్నాకే ఇంటికి తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయారు.కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ్, రఘు నలుగురు కలసి పరారయ్యారు.విద్యార్థులు నలుగురూ ప్లాన్ వేసుకుని గేటు దూకి వెళ్లిన దృశ్యాలు హాస్టల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో కనపడ్డాయి. ఈవిషయాన్ని వాళ్లు తోటి విద్యార్థులకు చెప్పడంతో ఈ విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.
తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 30 మంద విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
పారిపోయిన నలుగురు విద్యార్థులు 9వ తరగతి చదువుతున్నారు. వాళ్ల తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Four students Missing in Visakhapatnam
విద్యార్థుల కోసం రైల్వే స్టేషన్, బస్టాండ్లలోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు.