Omicron in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు తాజాగా ఏపీ, కేరళ, పంజాబ్‌ల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు, మొత్తం ఎనిమిది రాష్ట్రాలకు పాకిన మహమ్మారి

బ్రిటన్(Britain) నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్(Veena Gorge) తెలిపారు.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Kerala December 12: భారత్‌(India)లో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటి వరకు భారత్‌లో ఏడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు గుర్తించగా....తాజాగా ఆదివారం కేరళ(Kerala)లోనూ తొలికేసు(First case) నమోదైంది. బ్రిటన్(Britain) నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్(Veena Gorge) తెలిపారు.

ఒమిక్రాన్ సోకిన వ్యక్తి యూకే నుంచి అబుదాబి(Abu Dhabi) మీదుగా ఈ నెల 6న కొచ్చి(Kochi)కి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకు కొవిడ్‌ పాజిటివ్‌గా పరీక్షించినట్లు చెప్పారు. అలాగే అతని భార్య, తల్లికి సైతం కరోనా పాజిటివ్‌(Corona Positive)గా తేలింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని కేరళ ఆరోగ్యమంత్రి పేర్కొన్నారు. అయితే, సదరు వ్యక్తి వచ్చిన విమానంలో 149 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కరోనా కట్టడికి కేరళ అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది.

Omicron Spread: కొత్త వేరియంట్ రాకతో దేశంలో థర్డ్ వేవ్‌ గుబులు, రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, ఇప్పటివరకు 23 మందికి సోకిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్, ఒమిక్రాన్‌ కేసులు నమోదైన ప్రధాన దేశాలు ఇవే

ఇక కేరళ(Kerala)లో ఆదివారం కేరళలో 57,121 పరీక్షలు చేయగా.. 3,777 కొత్త కొవిడ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,361 యాక్టివ్ కేసులున్నాయి. భారత్‌ లో కేరళలోనే అధికంగా యాక్టీవ్ కేసులున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసు కూడా రావడంతో మరింత అప్రమత్తమయ్యారు. అటు ఆదివారం ఒక్క రోజే భారత్‌లో ఐదు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా.. మొత్తం సంఖ్య 38కి పెరగ్గా.. మహమ్మారి ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ ఉన్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, పంజాబ్,కేరళల్లో కొత్త కేసులు వచ్చాయి.



సంబంధిత వార్తలు

Fake Cop Video Calls Real Cyber Security Police: సైబ‌ర్ క్రిమిన‌ల్ కు లైవ్ లో షాక్ ఇచ్చిన పోలీసులు, యూనిఫాంతో ఏకంగా రియ‌ల్ పోలీస్ కే ఫోన్ చేసిన కేటుగాడు.. ఆ త‌ర్వాత ఏమైందంటే?

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!