Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు

20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

Gautam Adani, Gautam Adani Chairperson of Adani Group (Photo Credit: Wikimedia Commons)

New Delhi, Nov 21: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.

లంచం, మోసపూరిత కుట్ర కింద అదానిపై అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు అమెరికా ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు తెలిపారు.భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం లంచం ఇచ్చేందుకు రెడీ అయ్యారనే కారణం ఉందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ఆగని లేఆప్స్, ఉద్యోగాల కోతలు ప్రకటించిన డెలాయిట్, 180 మంది ఉద్యోగులను తీసేస్తున్న కన్సల్టింగ్ సంస్థ

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు.

గౌతమ్ అదానీని ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో నమోదయిన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరఫు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు. ఇక అదానీ గ్రూప్ పై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మధ్య అదానీ పోర్ట్స్ షేరు విలువ 20 శాతం పతనమయింది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif