Ghaziabad School Shut: స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు కరోనా, ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిలిపేసిన ఘజియాబాద్‌లో వైశాలి స్కూల్ యాజమాన్యం, ఆన్‌లైన్ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహణ
ఈ మేరకు స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిషేధించడమే కాకుండా ఆన్‌లైన్ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
కరోనావైరస్ ముప్పుతగ్గలేదని జాగ్రత్తగానే ఉండాల్సిందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆది నుంచి చెబుతూనే ఉంది. మరోవైపు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్‌కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు ముంబైలో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముప్పు ముగిసిపోయిందని అనుకోవడానికి వీల్లేదని జాగ్రత్తగ ఉండాల్సిందేనని నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వైశాలిలో కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు కరోనా (COVID-19 Positive) వచ్చింది.
దీంతో ఒక్కసారిగా స్కూల్ యజమాన్యం ఆఫ్‌లైన్ క్లాస్‌లను (Ghaziabad School Shut) నిలిపేసింది. ఈ మేరకు స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు ఆఫ్‌లైన్ క్లాస్‌లను నిషేధించడమే కాకుండా ఆన్‌లైన్ మోడ్‌లోనే క్లాస్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. అంతేగాదు విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా తల్లిదండ్రులు కోవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరించాలని పిలుపునిచ్చింది.
దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, ఇంకా 11,058 మందికి కొనసాగుతున్న చికిత్స
ఇటీవలే ఘజియాబాద్‌లోని ఒక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి మరువక మునుపే కొద్దిరోజుల్లోనే మరో ఘటన వెలుగు చూసింది. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తెరవాలని, యథావిధిగా తరగతులకు ప్రారంభించాలని ఆదేశించింది.