Gold Price: భగ్గుమన్న బంగారం, వెండి ధరలు, తొలిసారిగా రూ.50 వేల మార్కుకు చేరుకున్న గోల్డ్, రూ. 60 వేలు దాటిన వెండి
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా (Gold Price Hits Rs 50,000) రూ. 50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది.
Mumbai, July 22: దేశంలో బంగారం, వెండి ధరలు (Gold, Silver Price) బుధవారం భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 9 ఏళ్ల గరిష్టస్ధాయికి పెరగడంతో దేశీయ మార్కెట్‌లోనూ పసిడి రికార్డు స్థాయి పెరుగుదల నమోదు చేసింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం ఏకంగా 500 రూపాయలు పెరిగి తొలిసారిగా (Gold Price Hits Rs 50,000) రూ. 50,026కు ఎగిసింది. బంగారం బాటలోనే దూసుకెళ్లిన వెండి ఒక్కరోజులోనే 3502 రూపాయలు పెరిగి ఏకంగా 60,844కు ఎగబాకింది. డిసెంబర్ 31 వరకు ఇంటి నుంచే పని, ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్రం, దేశంలో కొనసాగుతున్న కరోనావైరస్ కల్లోలం
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరగడంతో పాటు అమెరికన్ డాలర్ బలహీనపడటంతో యల్లోమెటల్‌కు గిరాకీ పెరిగింది. ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి అమెరికాలో మరో భారీ ప్యాకేజ్ ప్రకటిస్తారనే అంచనాలు కూడా హాట్‌మెటల్స్‌కు డిమాండ్ పెంచాయి. అనిశ్చిత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి దీటుగా సురక్షిత రిటన్స్ అందిస్తాయనే నమ్మకంతో మదుపరులు బంగారం, వెండివంటి విలువైన లోహాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నిపుణులుపేర్కొంటున్నారు. దీంతో పాటుగా యుఎస్, చైనా వార్ నడుస్తున్న నేపథ్యంలో కూడా బంగారం ధర పెరిగిందని వార్తలు వస్తున్నాయి.