Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్, రెండు నెలలు తరువాత భారీగా తగ్గిన ధరలు, వెండి కూడ తగ్గడంతో పుల్ జోష్

దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా (Gold prices today fall) తగ్గాయి. కొత్త నెల సెప్టెంబర్ ప్రారంభంలోనే వెండి రేట్లు వివిధ నగరాలలో భారీగా క్రాష్ అయ్యాయి

Representational Image (Photo Credits: Pixabay)

బంగారం ప్రియులకు శుభవార్త. దేశంలో గురువారం బంగారం ధరలు భారీగా (Gold prices today fall) తగ్గాయి. కొత్త నెల సెప్టెంబర్ ప్రారంభంలోనే వెండి రేట్లు వివిధ నగరాలలో భారీగా క్రాష్ అయ్యాయి. వెండితో పాటు బంగారం ధర కూడా నేడు (Gold Price Today) నేల చూపులు చూస్తోంది. బులియన్‌ మార్కెట్‌(Bullion market)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గడంతో ప్రస్తుతం రూ.47,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాముల రూ.270 తగ్గడంతో రూ.51,270 ఉంది. వెండి ధరలు కూడా దిగొచ్చాయి. గురువారం బులియన్ మార్కెట్ లో కిలో వెండి రూ.50,800కే లభిస్తోంది.

నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.47 వేలుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.270 తగ్గి రూ.51,270గా నమోదైంది. బంగారంతో పాటు సిల్వర్ రేటు కూడా నేడు దిగొచ్చింది. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.60 వేలుగా పలుకుతుంది. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. బంగారానికి ప్రస్తుతం ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచనుందనే కారణంతో.. బంగారం, వెండి వంటి విలువైన మెటల్స్ రేట్లు కిందకు దిగివచ్చాయి.

గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారో తెలుసా? ఈ పదం వెనుక చాలా పెద్ద చరిత్రే ఉంది! గణపతి బప్పా మోరియా వెనుకున్న అసలు కథ ఇదే!

దేశ రాజధాని ఢిల్లీలో వెండి రేటు ఏకంగా రూ.3,200 మేర పతనమైంది.కేజీ వెండి రేటు రూ.3,200 మేర తగ్గడంతో.. అక్కడ సిల్వర్ రేటు రూ.50,800 పలుకుతోంది. అలాగే బంగారం రేట్లు కూడా నేల చూపులు చూస్తున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.250 తగ్గి రూ.47,150గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.51,440గా పలికింది.

బెంగళూరులో అయితే ఏకంగా రూ.9,300 మేర వెండి రేటు దిగొచ్చింది. దీంతో అక్కడ కేజీ వెండి రేటు రూ.60,100 నుంచి రూ.50,800కు పడిపోయింది. బెంగళూరులో బంగారం ధరలు 22 క్యారెట్లకు చెందిన ధర రూ.210 తగ్గి రూ.47,050గా, 24 క్యారెట్లకు చెందిన ధర రూ.270 తగ్గి రూ.51,320గా నమోదైంది.ముంబైలో కూడా వెండి రేటు రూ.3,200 మేర పతనమై.. రూ.50800కు దిగొచ్చింది. ముంబైలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ముంబైలో రూ.47 వేలుగా, 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.51,270గా నమోదవుతున్నాయి.

చెన్నైలో బంగారం రేటు భారీగా తగ్గిపోయింది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో ఏకంగా రూ.360 తగ్గడంతో.. అక్కడ రేటు రూ.47,540గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.390 తగ్గి రూ.51,860గా రికార్డయింది. చెన్నైలో సిల్వర్ రేటు రూ.100 తగ్గి రూ.60 వేలుగా ఉంది.