Kaifi Azmi: 20వ శతాబ్దపు ప్రఖ్యాత భారతదేశపు కవి, 11 ఏళ్లకే ఘజల్ రాసిన కైఫి అజ్మీ, ప్రేమ కవిత్వం నుంచి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం, కైఫి అజ్మీ 101వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

20వ శతాబ్దపు భారతదేశపు ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ(Kaifi Azmi) 101వ పుట్టిన రోజు సంధర్భంగా(101st Birth Anniversary) గూగుల్ తన పేజిపై డూడుల్(Google Doodle) ను అంకితమిచ్చింది. ఈ డూడుల్ ద్వారా గొప్ప భారతీయ ఉర్దూ కవి మరియు గేయ రచయిత కైఫీ అజ్మీకి ఘనంగా నివాళి అర్పించింది. ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ 14 జనవరి 1919 న ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు.

Google Doodle Pays Tribute to Poet Kaifi Azmi on His 101st Birth Anniversary (Photo-Google)

New Delhi, January 14: 20వ శతాబ్దపు భారతదేశపు ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ(Kaifi Azmi) 101వ జయంతి సంధర్భంగా(101st Birth Anniversary) గూగుల్ తన పేజిపై డూడుల్(Google Doodle) ను అంకితమిచ్చింది. ఈ డూడుల్ ద్వారా గొప్ప భారతీయ ఉర్దూ కవి మరియు గేయ రచయిత కైఫీ అజ్మీకి ఘనంగా నివాళి అర్పించింది. ప్రఖ్యాత కవులలో ఒకరైన కైఫీ అజ్మీ 14 జనవరి 1919 న ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌ఘర్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించారు.

1942 నాటి మహాత్మా గాంధీ(Mahatma Gandhi’) క్విట్ ఇండియా స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రేరణ పొందిన ఆయన ఉర్దూ వార్తాపత్రిక కోసం వ్యాసాలు రాయడానికి ముంబైకి వెళ్లారు. కైఫీ తరువాత ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాలో సభ్యుడయ్యాడు. ఉర్దూ సాహిత్యాన్ని భారతీయ సినిమాకు తీసుకువచ్చిన ఘనత ఈయనకే చెందుతుంది. సినిమాలో రచయితగా ఆయన చేసిన గొప్ప ఘనత 1970 నాటి ‘హీర్ రాంజా’ని(Heer Raanjha) చెప్పుకోవచ్చు, ఈ సినిమా మొత్తం డైలాగ్ పద్యంలో వ్రాయబడింది.

వ్యసనం అనేది జీవితంలో పరాజయం కానే కాదు, అదొక మానసిక స్థితి అంతే

Jhankar 1943లో ప్రచురించబడిన అజ్మీ యొక్క మొదటి కవితా సంకలనం. తరువాత అతను ప్రభావవంతమైన ప్రగతిశీల రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. మూడు ఫిలింఫేర్ అవార్డులు, సాహిత్యం మరియు విద్యకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు మరియు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ సహా అనేక అవార్డులను ఆయన గెలుచుకున్నారు.

‘చాచా’ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

నిజానికి కైఫి ముగ్గురు అన్నలు కూడా కవులే. తండ్రి కవి కాకపోయినప్పటికీ అతనిలో సాహిత్యాభిరుచి వుండేది. ఒకసారి ఒక ముషాయిరాకు కైఫీకి ఆహ్వానం వచ్చింది. ఆ ముషాయిరాలో కైఫీ చదివిన కవితను సభాధ్యక్షుడు ఎంతో మెచ్చుకున్నారు. అయితే కైఫీ ఆ కవిత రాశాడంటే అతని తండ్రికి నమ్మకం కుదరలేదు. అతని కవితాభినివేశానికి పరీక్ష పెట్టాడు. అతనికి రెండు పాదాల వాక్యాలు ఇచ్చి అదే ఛందస్సులో ఘజల్‌ రాయమన్నారు.

కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు

వెంటనే ఆ ఘజల్‌ రాసి ఇచ్చేశాడు కైఫీ. అప్పుడాయనకు కేవలం 11 ఏళ్ల వయస్సు. 'ఇత్నా తో జిందగి మే కిసికి ఖలాల్‌ పడే హన్స్‌నే సే హో సుకూన్‌ నా రోనే సే కల్‌ పడే' అని ప్రారంభమయ్యే ఆ ఘజల్‌ను బేగమ్‌ ఆక్తర్‌ పాడారు. అది అప్పుడు భారతదేశాన్ని ఉర్రూతలూగించింది.

చాలా మంది ఉర్దూ కవుల మాదిరిగానే కైఫీ ఆజ్మీ మొదట్లో ప్రేమ కవిత్వమే రాశాడు. అభ్యుదయ రచయితల పరిచయం ఆయన కవితా మార్గాన్ని మార్చేసింది. తన కవిత్వానికి సామాజిక స్పృహను జోడించారు. అయితే, దీని వల్ల కైఫీ కవిత్వం పేలవమై పోలేదు. భావోద్వేగ సాంద్రతతో విశిష్టతను సంతరించుకుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రతినిధిగా ఆయన కవిత్వం నిలబడింది.

ఆయన రచనలు- ఝంకార్‌, ఆఖిర్‌-ఓ-షాబ్‌, ఆవారా సజ్దే, ఇబ్లీస్‌ కి మజ్లీస్‌-ఎ- షూరా (దూస్రా ఇజ్లాస్‌)పవన్‌ కె. వర్మ అనే రచయిత ఆయన కవితలను ఎంపిక చేసుకుని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ప్రముఖ సినీ నటి షబనా ఆజ్మీ కైఫి ఆజ్మీ కూతురు. ఆమెకు తన తండ్రి రాసిన 'మకాన్‌' అనే కవిత అంటే చాలా ఇష్టం. పవన్‌ కె. వర్మ ఆంగ్లంలోకి అనువదించిన కైఫీ పుస్తకావిష్కరణ సభలో ఆమె ఈ కవితను చదివి వినిపించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now