Google Doodle On Plateau: జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్ 218వ జయంతి నేడు, ఫెనాకిస్టోస్కోప్‌ను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు
google-doodle-celebrating-218th-birth-anniversary-of-belgian-physicist-ferdinand-Plateau

October 14: టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రఖ్యాత బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్(Belgian physicist Joseph Antoine Ferdinand Plateau) 218వ జయంతి సంధర్భంగా కదిలే బొమ్మల చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టి ఆయనకు ఘనంగా తన శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ శాస్త్రవేత్త కదిలే చిత్ర పరికరమైన ఫెనాకిస్టోస్కోప్ ( phenakistiscope)ని ప్రపంచానికి అందించాడు. ఈ పరికరం సినిమా చరిత్రలో కదిలే చిత్రాలకు ఆది గురువుగా చెప్పవచ్చు. ఫిల్మిం ఇండస్ట్రీలో మోషన్ చిత్రాలకు ఈ పరికరం ద్వారానే అంకురార్పణ జరిగింది. ఈ పరికరాని జోసఫ్ 1832వ సంవత్సరంలోనే కనుగొన్నారు. ఆ తర్వాత ఇది టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ సినిమా రంగంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ఇప్పుడున్న యానిమేషన్ రంగానికి, ఇలస్ట్రేషన్ రంగానికి మూలకారణం ఈ పరికరమే.

1832లోనే యానిమేషన్ తో బొమ్మలను ఈ పరికరంతో శాస్త్రవేత్త తయారుచేశారు. జోసఫ్ తయారుచేసిన ఫెనాకిస్టోస్కోప్ పరికరంలో రెండు రకాల డిస్క్ లు ఉంటాయి. ఒకటి వ్యూయర్లు రేడియల్ విండోస్ చూసేందుకు రెండోది చిత్రాలను చూసేందుకు.. ఈ రెండింటింకి యానిమేషన్ ఎఫెక్ట్ జోడించి అదిరిపోయే అవుట్ లుక్ అప్పుడే అందించారు. అదే ఆ తర్వాత సినిమారంగంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ఫోటోల లుక్ ను ఎల్ఈడి డెవలప్ మెంట్ ద్వారా పూర్తిగా మార్చి సినిమా రంగానికి కొత్త టెక్నాలజీని అందించింది.

మూవింగ్ ఇమేజ్ పరికరంను కొనుగొన్న ప్లేటియూ( Plateau) జర్మనీలోని బ్రస్సెల్స్ లో అక్టోబర్ 14న జన్మించారు. చిన్నప్పుడు ఇతను ప్రయోగాల్లో ఆరితేరిపోయాడు. స్కూలు స్థాయిలోనే ఫిజిక్స్ మీద ప్రయోగాలు చేసి అందర్నీ అబ్బురపరిచాడు. ప్లేటియూ 1883లో మరణించారు.