Children's Day 2019: Google Celebrates 'Chacha' Nehru's Birthday with Colourful Doodle

Mumbai, Novemebr 14: ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని (Children's Day 2019) దేశవ్యాప్తంగా అత్యంత సంతోషంగా ఓ వేడుకలా జరుపుకుంటాం. స్వాతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజునే (Nehru's Birthday) బాలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆయనకు ఘనంగా విషెస్ చెప్పింది. గూగుల్ పేజీలో ప్రత్యేక డూడుల్(Google Doodle) ని రూపొందించింది. చిన్న పిల్లలు గీచిన ఆర్ట్ లా చెల్లతో నిండిని చిత్రాన్ని గూగుల్ పేజీలో ప్రవేశపెట్టింది.

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. అత్యధిఅలాగే అత్యధిక కాలం ప్రధాని (Prime minister)గా సేవలు అందించింది కూడా చాచానే. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ. నెహ్రు ఎక్కడికెళ్లినా.. పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా జైల్లో ఉన్నప్పుడు తన కుమార్తె ఇందిరకు అనేక ఉత్తరాలు రాసేవారు.

స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి విషయాలు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన స్ఫూర్తి, ధైర్యంతో ఇందిర ‘ఉక్కు మహిళ’గా రూపొందారు. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే.

పిల్లలకు కూడా పండిట్ నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనని ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’(Chacha) అని పిలుచుకుంటారు. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్ 14ను ‘చిల్డ్రన్స్ డే’గా జరుపుకొంటున్నాం.