Government Scraps Minimum Export Price: ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం, మహారాష్ట్ర ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
కనీస ఎగుమతి ధర (minimum export price condition) నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
New Delhi, SEP 13: ఉల్లి ఎగుమతులపై (onion exports) కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధర (minimum export price condition) నిబంధనను ఎత్తివేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని డీజీఎఫ్‌టీ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీంతో రైతులకు మేలు చేకూరనుంది. దేశీయంగా ఉల్లి ధరలు (onion price) పెరగకుండా ఎగుమతులపై కేంద్రం గతేడాది ఆంక్షలు విధించింది. తొలుత ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఏడాది మే నెలలో ఎగుమతుల సుంకం తొలగించినప్పటికీ.. టన్నుకు 550 డాలర్లకు కనీస ధరను నిర్ణయించింది. అంటే అంతకంటే తక్కువకు ఉల్లిని రైతులు ఎగుమతి చేయడానికి వీల్లేదు.
ఎగుమతులను నిరాశపరిచి దేశీయంగా ఉల్లి లభ్యతను పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఉల్లిని ఎక్కువగా ఉత్పత్తి (Maharastra Onion) చేస్తుంటారు. ఉల్లిపై ఆంక్షలు విధించడంపై కొంతకాలంగా ఉల్లి రైతులు గుర్రుగా ఉన్నారు. పలు చోట్ల రోడ్లెక్కిన సందర్భాలూ ఉన్నాయి.
బాస్మతి బియ్యం (basmati rice)పైనా కనీస ఎగుమతి ధర నిబంధనను తొలగించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం టన్నుకు కనీస ఎగుమతి ధరను 950 డాలర్లుగా కేంద్రం నిర్ణయించింది. ఈ నిబంధన తొలగింపుతో బాస్మతి బియ్యం ఎగుమతులతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి.