Greater Noida: మందు మానేయమన్న అక్క, కోపంతో ఆమెను దారుణంగా కాల్చి చంపేసిన తమ్ముడు, గ్రేటర్ నోయిడాలో దారుణం
హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై (drinking habit) అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది.
Noida, Mar 15: గ్రేటర్ నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై (drinking habit) అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు చిన్నారులు మృతి, మరో ఇద్దిరకి గాయాలు
అసలే తాగి ఉన్నాడని తెలిసి కూడా అతనితో వాదనకు దిగింది. ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి (18-year-old youth shoots sister dead) అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు‍్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు