Gujarat: శృంగారం కోసం రూంలోకి పిలిచిన భార్య, ఎనిమిదేళ్లుగా తప్పించుకు తిరిగిన భర్త, కట్ చేస్తే మగాడిని కాదంటూ సర్జరీకి వెళుతున్నానంటూ షాక్, భార్య ఏం చేసిందంటే..
దాదాపు ఎనిమిదేళ్లు కావురం తర్వాత (8 years after marriage) భర్త మగాడు కాదని తెలియడంతో భార్య ఒక్కసారిగా షాక్ తింది.ఈ ఘటనపై కలత చెందిన ఆమె న్యాయం కోసం ఇప్పుడు గోత్రి పోలీసులను ఆశ్రయించింది.
Vadodara, Sep 16: గుజరాత్ రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. దాదాపు ఎనిమిదేళ్లు కావురం తర్వాత (8 years after marriage) భర్త మగాడు కాదని తెలియడంతో భార్య ఒక్కసారిగా షాక్ తింది.ఈ ఘటనపై కలత చెందిన ఆమె న్యాయం కోసం ఇప్పుడు గోత్రి పోలీసులను ఆశ్రయించింది. ఘటన వివరాల్లోకెళితే.. గుజరాత్ వడోదరకు చెందిన మహిళ.. మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేస్తున్న విరాజ్ వర్దన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. అయితే శారీరకంగా కలవకుండా చాలాకాలంపాటు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు విరాజ్. దీంతో ఆమె ఓ రోజు ఒత్తిడి చేయగా.. గతంలో రష్యాలో ఉండగా తనకు యాక్సిడెంట్ అయ్యిందని.. సంసార సుఖానికి తాను పనికిరానని, మైనర్ సర్జరీ జరిగిందని తాను మామూలు స్థితికి రాలేనని ఆమెతో చెప్పేశాడు.
దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడనుకుని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే మెదులుతూ వచ్చింది. ఇలా ఉండగా.. 2020 జనవరిలో బరువు తగ్గే సర్జరీ కోసం కోల్‌కతా వెళ్లాడు విరాజ్. తిరిగొచ్చిన విరాజ్.. తన భార్యతో శారీరకంగా కలవడం మొదలుపెట్టాడు.అయితే అతను కోల్‌కతా వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుడి అవయవాల మార్పిడి కోసమని డాక్టర్ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న (husband was earlier a woman in Vadodara) ఆమెకు నోట పడిపోయింది.నిజం తెలిసి అతన్ని నిలదీయడంతో అతను ఆ తరువాత నిజాన్ని వెల్లడించాడు మగ అవయవాలను అమర్చోకోవడానికి తాను లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పాడు.
అయితే శస్త్ర చికిత్స గురించి తనకు ఎలాంటి వివరాలు చెప్పలేదని మహిళ చెప్పింది.అతను తనతో "అసహజ సెక్స్" చేయడం ప్రారంభించాడని, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది.విజైతా అనే యువతి.. సర్జరీ ద్వారా విరాజ్‌గా మారి.. మ్యాట్రిమోనియల్ సర్జరీ ద్వారా తనను సంప్రదించిందని, విజైతా కుటుంబం కూడా తనను మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొంది.. ఢిల్లీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి.. వడోదరాకు తీసుకొచ్చారు పోలీసులు. ప్రస్తుతం ఈ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది. విచిత్రమేమిటంటే 2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట హనీమూన్‌కి కాశ్మీర్‌కు కూడా వెళ్లారు ఈ దంపతులు.