Manoj Shashidhar: కొత్త బాస్ వచ్చేశాడు, సీబీఐ జేడీగా మనోజ్ శశిధర్, 1994 గుజరాత్ కేడర్‌ ఐపీఎస్ అధికారి, అయిదేళ్లపాటు పదవిలో కొనసాగనున్న మనోజ్ శశిధర్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ

ఆయన 1994 గుజరాత్ కేడర్(Gujarat)కు చెందిన అధికారి. ఈ పదవిలో మనోజ్ శశిధర్ అయిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన మనోజ్ గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, (PM Modi) అమిత్ షాలకు(Amit Shah) ఆయన అత్యంత సన్నిహిత అధికారిగా కూడా పేరు ఉంది.

Gujarat-cadre officer Manoj Shashidhar appointed CBI Joint Director (Photo-Facebook)

New Delhi, January 18: సీబీఐ జాయింట్ డైరెక్టర్ (CBI Joint Director) గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్(Senior IPS officer Manoj Shashidhar) నియమితులయ్యారు. ఆయన 1994 గుజరాత్ కేడర్(Gujarat)కు చెందిన అధికారి. ఈ పదవిలో మనోజ్ శశిధర్ అయిదేళ్ళపాటు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన మనోజ్ గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, (PM Modi) అమిత్ షాలకు(Amit Shah) ఆయన అత్యంత సన్నిహిత అధికారిగా కూడా పేరు ఉంది.

ప్రస్తుతం ఆయన గుజరాత్‌లో అదనపు డిజి, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) గా పనిచేస్తున్నారు. గతంలో వడోదర పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, అహ్మదాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్, రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సహా ముఖ్యమైన హోదాల్లో మనోజ్ శశిధర్ పనిచేశారు.

వైసీపీ ఎంపీ లేఖపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కాగా సీబీఐ జేడీ గా ఏపీకి (Andhra pradesh)చెందని వ్యక్తిని, రాజకీయాలకు చెందని వ్యక్తిని నియమించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijay sai reddy)ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మరో వైపు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సన్నిహితుడైన హెచ్.వెంకటేష్ అనే అధికారి సీబీఐ జేడీగా రావటానికి చేస్తున్నప్రయత్నాలను కూడా విజయసాయి రెడ్డి తన లేఖలో ఉదహరించారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandra Babu) తన మనుషులను సీబీఐలో పెట్టుకుని చక్రం తిప్పాలని చూస్తున్నారని కూడా విజయసాయిరెడ్డి ఆరోపించారు. విజయసాయి రెడ్డి లేఖకు అమిత్ షా వెంటనే స్పందించి ఆలేఖను సిబ్బంది వ్యవహారాల శాఖకు పంపించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సీబీఐ జేడీ నియామకం జరిగింది.



సంబంధిత వార్తలు