Gujarat, Himachal Election Results 2022: గుజరాత్‌లో దూసుకుపోతున్న బీజేపీ, హిమాచల్‌లో నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్న కాంగ్రెస్-బీజేపీ, ఉత్కంఠగా కొనసాగుతున్న కౌంటింగ్, భారీ భద్రత ఏర్పాటు
హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది. హస్తం పార్టీ 35 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, బీజేపీ 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఇతరులు మరో 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి.
Ahmadabad, DEC 08: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల (Gujarat, Himachal Election Results ) లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలో 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగిస్తున్నారు. ఇక్కడ మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలనుంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా 10వేల మంది భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో 68 స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్కుకు 34 స్థానాల్లో విజయం సాధించాలి. కాగా, 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి పట్టంకట్టని హిమాచల్ ప్రజలు ఈ సారి ఆ ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది. గుజరాత్ లో రెండు విడుతల్లో సాగిన ఎన్నికల్లో మొదటి విడుతలో 63.31 శాతం, రెండో విడుతలో 65.22 శాతం పోలింగ్ నమోదైంది. ఇక గుజరాత్ లో (GujaratElectionResult) 132 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 41 సీట్లలో, ఆప్ 5, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కన్పిస్తున్నాయి. హిమాచల్‌లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతున్నది. హస్తం పార్టీ 35 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, బీజేపీ 22 సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. ఇతరులు మరో 4 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 సీట్లలో గెలుపొందినవారే అధికారం చేజిక్కించుకోనున్నారు. అయితే 1985 నుంచి రాష్ట్రంలో వరుసగా రెండో సారి ఏ పార్టీ అధికారంలోకి రాలేదు.