Gujarat Student Gets 212 Out Of 200 Marks: ఇదేందయ్యా ఇదీ! గుజరాత్ విద్యార్ధికి 200కు గానూ 212 మార్కులు వేసిన టీచర్, ప్రోగ్రెస్ కార్డు చూసి అవాక్కయిన పేరెంట్స్, వైరల్ ఫోటో ఇదుగోండి!
ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. (Gujarat student Marks) గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Ahmadabad, May 06: ఒక విద్యార్థికి పరీక్షా ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో 200 మార్కులకు గాను 212, 211 మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ షీట్ చూసి ఆ విద్యార్థి, తల్లిదండ్రులతోపాటు అంతా షాక్ అయ్యారు. కంగుతిన్న విద్యాశాఖ అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. (Gujarat student Marks) గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖరసనా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాల్గవ తరగతి విద్యార్థిని వంశీబెన్ మనీష్‌భాయ్‌కు పరీక్షల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. రెండు సబ్జెక్టులలో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. గుజరాతీ పరీక్షలో 200కుగాను 211, గణితంలో 200కుగాను 212 మార్కులు (212 Out Of 200 In Primary Exam) సాధించినట్లు రిజల్ట్ షీట్‌లో పేర్కొన్నారు.
కాగా, పరీక్షల్లో తనకు వచ్చిన ఈ మార్కులు చూసి విద్యార్థిని వంశీబెన్ ఆశ్చర్యపోయింది. ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను తన పెరేంట్స్‌కు చూపించింది. దీంతో ఈ మార్కులు చూసి వారు కూడా షాక్ అయ్యారు. ఈ మార్కుల షీట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గుజరాత్‌లోని విద్యా వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు దీనిపై స్పందించారు. ఆ మార్కులను సవరించారు. గుజరాతీ పరీక్షలో 200కుగాను 191గా, గణితంలో 200కుగాను 190 మార్కులుగా మార్పు చేశారు. ఈ మేరకు కొత్త ప్రొగ్రెస్ రిపోర్ట్ జారీ చేశారు. తొలుత జరిగిన పొరపాటుపై దర్యాప్తునకు ఆదేశించారు.