ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి 2024 ఫలితాలను కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్స్‌ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐసీఎస్‌ఈ క్లాస్‌ 10 పరీక్షకు 2,43,617 మంది హాజరుకాగా, వీరిలో 2,42,328 మంది పాస్​ అయ్యారు. ఇక ఐఎస్‌సీ క్లాస్ ​12 పరీక్ష రాసిన 99,901 మంది విద్యార్థుల్లో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇక ఐసీఎస్‌ఈ 10 ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 99.65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 99.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్‌సీ 12 ఫలితాల్లో బాలికలు 98.92 శాతం, బాలురు 97.53 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. ఆయా విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org, cisc.org వెబ్‌సైట్స్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)