Gujarat: దారుణం.. స్కూలు వెనకకు లాక్కెళ్లి విద్యార్థినిపై ఆరుమంది సామూహిక అత్యాచారం, నిందితుల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

న‌ర్మ‌ద జిల్లా దెదియ‌ప‌ద ప‌ట్ట‌ణంలో (Gujarat's Narmada) ఆరుగురు టీనేజ‌ర్లు ప‌ద‌కొండో త‌ర‌గ‌తి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడికి ( Teens gang-rape Class 11 student) పాల్ప‌డిన ఉదంతం వెలుగుచూసింది.

Representational Image (Photo Credits: File Image)

Narmada, Feb 3: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. న‌ర్మ‌ద జిల్లా దెదియ‌ప‌ద ప‌ట్ట‌ణంలో (Gujarat's Narmada) ఆరుగురు టీనేజ‌ర్లు ప‌ద‌కొండో త‌ర‌గ‌తి విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడికి ( Teens gang-rape Class 11 student) పాల్ప‌డిన ఉదంతం వెలుగుచూసింది. బాధిత బాలిక‌ను నిందితుడు ఎస్‌టీ డిపో ప్రాంతం నుంచి స్కూల్‌కు తీసుకువెళ్లాడు. ఆపై స్కూల్ భ‌వ‌నం వెనుక మ‌రికొంద‌రితో క‌లిసి పైశాచికానికి తెగ‌బ‌డ్డాడు. ఈ దారుణ ఉదంతంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఘ‌ట‌న‌కు సంబంధించి ఆరుగురు నిందితుల‌ను (6 held ) పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక తెలంగాణ రాజధానిలో జరిగిన మరో ఘటనలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై బంజారాహిల్స్​‍ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్​‍ రోడ్‌ నెం 1లోని కమలాపురి కాలనీలో నివాసం ఉంటున్న యువతి (38) బ్యూటీ ప్రొడక్ట్స్‌ విక్రయించడంతో పాటు మహిళలకు మసాజ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో తన భార్య, తల్లికి కావాల్సిన మెహందీ పౌడర్‌ తదితర వస్తువులను తీసుకునేందుకు వచ్చే క్రమంలో ఆమెకు తమీమ్‌ జలాల్‌ అలియాస్ అఖీల్ (28) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే క్రమంలో ఎవరూ లేని సమయంలో యువతిని బలవంతంగా లోబర్చుకున్న తమీమ్‌ జలాల్‌ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

హనీ ట్రాప్‌ వల నుంచి తృటిలో తప్పించుకున్న మంత్రి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేయడంతో ఆత్మాహత్యా ప్రయత్నం

ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే సంవత్సరాలు గడిచినా పెళ్లి మాట ఎత్తకపోగా ఇటీవల ముఖం చాటేస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



సంబంధిత వార్తలు