Gujarath Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, గుడిసెలోకి దూసుకెళ్లిన ట్రక్కు, నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో విషాద ఘటన

సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పిన ఒక ట్రక్కు రోడ్డు పక్కన గుడిసెలోకి (8 killed as truck rams into hut) దూసుకు వెళ్లింది. ఆ సమయంలో గుడిసెలో నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

Road accident (image use for representational)

Gandhi Nagar, August 9: గుజరాత్‌లోని అమ్రేలీ పరిధిలోని బాధ్డా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం (Gujarath Road Accident) చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో అదుపు తప్పిన ఒక ట్రక్కు రోడ్డు పక్కన గుడిసెలోకి (8 killed as truck rams into hut) దూసుకు వెళ్లింది. ఆ సమయంలో గుడిసెలో నిద్రిస్తున్న 8 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు సావర్ కుండలా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన ప్రాంతం భీతావహంగా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదానికి కారణమైన ట్రక్కు మహువా వైపు వెళుతోంది. బాద్ధా గ్రామం సమీపంలోకి రాగానే ట్రక్కు అదుపుతప్పి, ఒక గుడిసెలోకి దూసుకెళ్లి, తరువాత 8 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

వాకింగ్ వేళ...త్రిపుర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం, ముఖ్యమంత్రిని కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా త్రుటిలో తప్పించుకున్న విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు

క్రేన్‌ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. గుడిసెలో పది మంది నిద్రిస్తుండగా.. వారిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురవగా ఆసుప్రతికి తరలించినట్లు అమ్రేలి ఎస్‌పీ నిర్లిప్త్‌రాయ్‌ తెలిపారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారని చెప్పారు.