Guwahati-Bikaner Express derailed: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం, ముగ్గురు మృతి, 20 మందికి పైగా గాయాలు, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, మమతా బెనర్జీ
ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా ఆరు బోగీలు తలకిందులయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి.
Jalpaiguri,January 13: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం(Guwahati-Bikaner Express Derails) జరిగింది. పాట్నా నుంచి గౌహతి వెళుతున్న గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ (Guwahati-Bikaner Express)బెంగాల్‌లోని మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది( train derailed). ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా ఆరు బోగీలు తలకిందులయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి.
రైలు ప్రమాదంలో 12 కోచ్‌లు దెబ్బతిన్నాయని ప్రమాద స్ధలానికి డీఆర్ఎం(DRM), ఏడీఆర్ఎం(ADRM) చేరుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలువురు బోగీల నుంచి కిందకు దూకడం కనిపించింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రైలు భారీ కుదుపుకు లోనవడంతో తాము రైలు పట్టాలు తప్పిందని గుర్తించామని బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్(Guwahati-Bikaner Express ) ప్రయాణీకుడు తెలిపారు.
ప్రమాద ఘటనపై రైల్వే భద్రతా విచారణకు ఆదేశించామని రైల్వేలు తెలిపాయి. స్థానికుల సహయంతో క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం ఐదుగంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. .. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ(Mamatha Benarjee)తో మాట్లాడారు. రైలు ప్రమాదంపై మమత విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనాస్థలానికి శుక్రవారం నాడు రైల్వే మంత్రి వెళ్లనున్నారు.