Wrestlers Protest: అంతమందితో లైంగిక వాంఛ తీర్చుకునే శక్తి నాలో ఉందా, దాని కోసం నేనేమైనా లేహ్యం తిన్నానా, రెజ్లర్ల నిరసన వేళ బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.

Brijbhushan-Sharan-Singh (Photo-ANI)

Delhi, May 2: దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.అంతకంటే ముందు వంద మందిపై తాను లైంగిక వేధింపులకు పాల్పడ్డానని అన్నారు. నేనేమైనా శిలాజిత్‌తో( శారీరక పటుత్వాన్ని పెంచే లేహ్యం) చేసిన రోటీలు తిన్నానా ఏంది?’ అంటూ వెటకారం, వ్యంగ్యంతో కూడిన సమాధానమిచ్చారు.

మీ ధర్నా వల్ల భారత్ పరువు పోతుందని తెలిపిన పీటీ ఉష, గతంలో వేధిస్తున్నారంటూ అందరి ముందు ఎందుకు ఏడ్చావని ప్రశ్నిస్తున్న భారత రెజ్లర్లు

అంతమందితో లైంగిక వాంఛను తీర్చుకునే లైంగిక పటుత్వం తనలో ఉన్నదా? అనే భావం వచ్చేట్టు మాట్లాడారు.బ్రిజ్‌ భూషణ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రెజ్లర్ల నిరసన కేవలం రాజకీయ ప్రేరేపితం తప్ప, వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాల్లేవని, నన్ను ఉరితీసినా సరే జాతీయ పోటీలు, ఆటగాళ్ల క్యాంపులు నిలిచిపోవడానికి వీల్లేదంటూ బ్రిజ్‌ వ్యాఖ్యానించారు. కాగా నిరసనకు దిగిన రెజ్లర్లకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఇతరులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఢిల్లీ పోలసులు కేసు నమోదు చేశామని తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif