Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీ కిడ్నీలో రాళ్లు ఉన్నట్లే..
ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది
ఈ మధ్యకాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన నొప్పిని, జ్వరాన్ని, వాంతులు, వికారం లక్షణాలను ఇస్తుంది. ఇది ఒక్కసారి చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ముందే మన శరీరం కొన్ని రకాల సంకేతాలను ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రం విసర్జనలో నొప్పి- కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు మూత్ర విసర్జన చేసే సమయంలో చాలా నొప్పిగా ఉంటుంది సంకేతం.
మూత్రంలో రక్తం రావడం- కొన్నిసార్లు మూత్ర విసర్జన సమయంలో రక్తము వస్తుంది. ఇది కూడా మూత్రపిండాల్లో రాళ్ల వల్ల ఏర్పడుతుంది. ఈ లక్షణం మీకు కనిపిస్తున్నట్లయితే మీ మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లు గుర్తించవచ్చు. ఈ రాళ్ల వరిపిడి వల్ల మూత్రంలో రక్తం అనేది పడుతూ ఉంటుంది. వెంటనే వైద్యుణ్ని సంప్రదించి సరైన చికిత్స చేసుకోవడం ఉత్తమం.
మూత్రం తక్కువగా రావడం- కొంతమందిలో కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రము సరిగ్గా ఉత్పత్తి అవ్వదు. దీనివల్ల చాలా తక్కువ సార్లు మూత్ర విసర్జన అవుతుంది. మీరు రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే అది మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడిందని చెప్పడానికి సంకేతం.
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా,
మూత్రం నురుగు ఎక్కువగా రావడం- మూత్ర విసర్జన సమయంలో మూత్రము నురుగు ఎక్కువగా వస్తుంది. అటువంటి అప్పుడు కూడా కిడ్నీలో రాళ్లు ఉన్నదానికి సంకేతంగా చెప్పవచ్చు. ఒకవేళ గనుక మీకు ఈ లక్షణం కనిపించినట్లయితే మీ మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లుగా గుర్తించవచ్చు.
నివారణ చర్యలు- మీరు ఎక్కువగా తీసుకోవాలి జంక్ ఫుడ్ ను తగ్గించాలి. అంతే కాకుండా మీరు తీసుకునే ఆహారంలో సాల్ట్ ని, టమాటాలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ బట్టి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటివల్ల కిడ్నీలో రాళ్లు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ను అధికంగా తీసుకోవాలి. అంతేకాకుండా మజ్జిగను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి