ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ బిపి, షుగర్ ,థైరాయిడ్ ఇటువంటి సమస్యలు పెరుగుతాయి. బరువు తగ్గించుకోవడం కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం జీవనశైలిలో మార్పు వ్యాయామం సమతుల్యమైన ఆహారం వంటివి తీసుకోవడం ద్వారా పరువు తగ్గవచ్చు అయితే ముఖ్యంగా ఈ మూడు గింజలను తీసుకోవడం ద్వారా బరువు పెరగకుండా ఉంటారు ఆ మూడు గింజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలు- అవిస గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబరు అధికంగా ఉంటుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి వరంగా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది
పొద్దు తిరుగుడు గింజలు- వద్దు తిరిగుడి గింజల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటే ఇది అని కరకాల జబ్బులు రానివ్వకుండా చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఐరన్ మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి రక్తహీనత సమస్య రాకుండా చేయడంలో పొద్దుతిరుగుడి గింజలు సహాయపడతాయి. అంతేకాకుండా తీసుకోవడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా ఆకలి ఎక్కువసేపు వేయదు దీనివల్ల బరువు తగ్గుతారు.
గుమ్మడి గింజలు- గుమ్మడి గింజల్లో అనేక రకాల పుష్కాలు ఉంటాయి. ఇందులో మెగ్నీషియము, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. రక్తం తక్కువగా ఉన్న వారిలో కూడా అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. ఇది మన శరీరానికి రక్తాన్ని అందించడంతో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడంలో కూడా గుమ్మడి గింజలు సహాయపడతాయి. ఇది బరువు నియంత్రణలో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి