Health Tips: పచ్చి అరటి కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా, ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఎన్నో..
అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు.
అరటిపండు లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు. అయితే అరటి పండులో ఉన్నట్టుగానే అరటికాయలు కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి. పచ్చి అరటికాయను తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చి అరటికాయలో ఉన్న పోషకాలు- విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ b6 మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక రకాల జబ్బుల నుండి బయట వేయడానికి సహాయపడుతుంది. పచ్చి అరటిపండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ క్రియ కు మంచిది- పచ్చి అరటిపండు తినడం ద్వారా జీర్ణ క్రియ కు చాలా మంచిది. మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం, కడుపుబ్బరం, వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..
బరువు తగ్గుతారు- పచ్చి అరటికాయల ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా ఇది తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు పచ్చి అరటి కాయలను తిన్నట్లయితే తొందరగా బరువు తగ్గుతారు.
గుండెకు మంచిది- పచ్చటి పండ్లు హైపర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల తగ్గించే మంచి కొలెస్ట్రాల పెంచుతుంది. దీని ద్వారా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పొటాషియం ఉండడం వల్ల బిపి పేషంట్లకు కూడా చాలా చక్కటి చెప్పవచ్చు.
షుగర్ పేషెంట్స్ కు మంచిది- పచ్చి అరటి పండులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కు మంచిది షుగర్ పేషెంట్స్ తీసుకోవడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి