కాకరకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు కాకరకాయ చాలా మంచిదని చెప్పవచ్చు. కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది. కాకరకాయ తీసుకోవడం చాలా మంచిదైనప్పటికీ కూడా కొన్ని ఆహార పదార్థాలతో దీన్ని కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకరకాయను ఏ ఆహార పదార్థాలతో తీసుకోకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బెండకాయ- కాకరకాయతో బెండకాయ కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. రెండిటి PH వాల్యూ వేరేగా ఉంటుంది. కాకరకాయ చేదుగా ఉండడం, బెండకాయ వగరుగా ,జిగటక ఉండడం ఈ రెండిటి కలయిక అంత మంచిది కాదు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తినే ప్రమాదం ఉంది ముఖ్యంగా కడుపునొప్పి అజీర్ణం వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాకరకాయతోటి బెండకాయ కలిపి అస్సలు తీసుకోకూడదు.
Health Tips: డెలివరీ తర్వాత పొట్ట బాగా పెరిగిందా,
కోడిగుడ్డు- కాకరకాయ తిన్నప్పుడు కోడిగుడ్డులు కూడా తినకూడదు. దీనివల్ల నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకరకాయ వేడి ఉంటుంది. అదే విధంగా కోడి గుడ్డు కూడా వేడి కలిగి ఉంటుంది. ఈ రెండిటి కలయిక వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది ఇది ఒక్కొక్కసారి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడిగుడ్డు కాకరకాయ కలిపి తీసుకోకూడదు.
చేపలు- కాకరకాయ చేపలు కలిపి అసలు తీసుకోకూడదు. చేపలు చల్లటి స్వభావానికి కలిగే ఉంటాయి. కాకరకాయ కాస్త వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండిటి పీహెచ్ వాల్యూ వేరువేరుగా ఉంటుంది. దీని వల్ల జీలక్రియలో ఇబ్బందేలు ఎదురయ్యే సమస్య ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి