Pregnancy

గర్భధారణ సమయంలో శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత స్త్రీలలో శరీరం ఇంతకుముందు లాగా ఉండదు. డెలివరీ తర్వాత చాలామంది మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం. గర్భధారణ సమయంలో మనము అధికంగా ఆహారం తీసుకోవడం బిడ్డ కోసం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పెరుగుతుంది. డెలివరీ తర్వాత కూడా కొన్ని భాగాలలో ఈ అదనపు కొవ్వు ఉంటుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది. ఈ పెరిగిన కొవ్వును తగ్గించుకోవడం కోసం కొన్ని రకాల మార్గాలను మనము పాటిచ్చినట్లయితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.

పోషక ఆహారం- డెలివరీ తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడానికి మనం సరైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లో ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు బొప్పాయ, ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇది బరువు పెరగకుండా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా స్వీట్స్ ఆయిల్ ఫుడ్లకు దూరంగా ఉండాలి వీటివల్ల పెరిగిన పొట్ట చుట్టుకోవు తగ్గుతుంది.

నీరు అధికంగా తాగాలి- నీటిని అధికంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. డెలివరీ తర్వాత శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి మన శరీరానికి నీరు తగినంత అవసరం. ఇది జీర్ణ క్రియలను మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో పోయిన పెరుక్కపోయిన టార్జన్లను బయటకు పంపించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Health Tips: కడుపులో వచ్చే క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఏమిటి? 

వ్యాయామం- డెలివరీ తర్వాత శరీరం ఫిట్ గా ఉండాలంటే కొంచెం తేలికపు వాటి వ్యాయమాలు చేయడం ముఖ్యము. నడక యోగ వెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు వంటివి సులభమైన వ్యాయామాలను ప్రారంభించినట్లయితే ఇది పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తాయి. అంతేకాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

తల్లిపాలు బిడ్డకు ఇవ్వాలి- తల్లిపాలు బిడ్డకు ఇవ్వాలి దీని ఇది బిడ్డ ఆరోగ్యానికే కాకుండా తల్లి ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. మీరు మీ బిడ్డకు తల్లిపాలు ఇచ్చినప్పుడు అదనపు క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఇది సహజమైన మార్గంగా చెప్పవచ్చు.

తగినంత నిద్ర- నిద్ర మన శరీరం పైన ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మనకు తగినంత నిద్ర లేనప్పుడు శరీరం ఒత్తిడికి గురవుతుంది. కొవ్వు పెరగడానికి సహాయపడుతుంది. అందువల్ల డెలివరీ తర్వాత మంచి నిద్ర పోవడం చాలా ముఖ్యము. మన శరీరానికి రిలాక్స్ ఇవ్వడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న అదనపు కొవ్వును తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి