Health Tips: కంటి చూపు తగ్గుతుందని బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు.

నేటి జీవన శైలి వల్ల చాలామంది కంటిచూపు తగ్గడం వంటి సమస్యతో బాధపడుతున్నారు.

What happens if the right eye for males and left eye for females blinking?

కళ్ళు మనకు ఎంతో విలువైన మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. నేటి జీవన శైలి వల్ల చాలామంది కంటిచూపు తగ్గడం వంటి సమస్యతో బాధపడుతున్నారు. వారి జీవనశైలిలో మార్పు, పోషకాహారం లోపాలు, ఎక్కువగా స్క్రీన్ చూడడం ద్వారా కళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే కొన్ని ఆహార పదార్థాల ద్వారా మన కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తోటకూర- తోటకూరలో విటమిన్ ఏ, కె ,సి ,పొటాషియం, ఐరన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తోటకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని బలపరుస్తాయి.

క్యారెట్-  క్యారెట్ల విటమిన్ ఏ అత్యధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. క్యారెట్ లను సలాడ్ రూపంలో జ్యూస్ రూపంలో లేదా కూర రూపంలో కూడా తీసుకోవచ్చు.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

విటమిన్ సి ఫ్రూట్స్- విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్, నిమ్మ, ఉసిరి వంటి ఆహార పదార్థాలను మీరు ఆహారంలో భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజ పండును తినడం ద్వారా లేదా దాని రసం తాగడం ద్వారా మన కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా కంటి కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ పొందుతాము.

స్వీట్ పొటాటో- స్వీట్ పొటాటో లో కూడా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది మన కంటి చూపును పెంచుతుంది. చూపు తగ్గడం వంటి సమస్యల నుండి రక్షిస్తుంది.

బెర్రీస్- బెర్రీస్ ని ప్రతిరోజు మీరు ఆహారంలో భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ సి వంటివి మన కంటి చూపును పెంచుతాయి.

రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం ద్వారా మనము దృష్టిలోపాన్ని తగ్గించుకోవచ్చు. క్రమం తప్పకుండా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీ కంటి చూపు మెరుగుపడుతుంది. అద్దాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలతో మీ చర్మం నిగారింపును కూడా సంతరించుకుంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif