papaya

బొప్పాయి పండు మన శరీరానికి ఎన్నో పోషకాలు అందిస్తుంది. బొప్పాయి పండులో పొటాషియం, విటమిన్స్, ఫైబర్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బొప్పాయి  ముక్కలు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడతారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి అధికంగా ఉండడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచి అనేక రకాలైన ఇన్ఫెక్షన్ల నుండి బయటపడేస్తుంది. ఇందులో విటమిన్ ఏ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులను కూడా నయం చేసుకోవచ్చు.బొప్పాయి  వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యాన్సర్ ను తగ్గిస్తుంది- బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. ఇందులో ముఖ్యంగా బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్. ఇది విటమిన్ ఏ గా మారుతుంది. ఇది క్యాన్సర్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది. ఫైబర్ రిచ్ ఉన్న ఆహారాల వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణ వ్యవస్థకు మంచిది- బొప్పాయి లో పెపైన్ అని ఎంజాయ్ ఉంటుంది. ఇది మన జీవ క్రియను సక్రమంగా ఉంచడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న ప్రోటీన్ ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది.  అప్పుడు బొప్పాయిని తీసుకున్నట్లయితే తొందరగా జీర్ణం చేస్తుంది.

ఇమ్యూనిటీని పెంచుతుంది- బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి జలుబు దగ్గు జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల నుండి బయటపడేస్తుంది.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి

చర్మానికి చాలా మంచిది- బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ ఇ ,సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ముడతలు రాకుండా మొహం పైన మచ్చలు లేకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది. పండిన బొప్పాయిను ఫేస్ పైన ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే ఇది మొటిమలను మచ్చల నుండి బయటపడేస్తుంది. మీ చర్మాన్ని మెరిసేలాగా చేస్తుంది.

బరువు తగ్గడానికి- బొప్పాయి పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా క్యాలరీలు తక్కువ ఉండడం ద్వారా ఇది మన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకున్న తర్వాత కడుపు నిండినట్లుగా ఉండడం ద్వారా ఆకలి అనేది తగ్గుతుంది. దీని ద్వారా పొట్ట తగ్గుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ వల్ల మన పొట్టలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి పోయి బరువు తగ్గడానికి.

కంటికి మంచిది- బొప్పాయిలో విటమిన్ ఏ ,కెరోటి నాయుడ్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

వీరు తీసుకోకూడదు- బొప్పాయి పండు తినడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయిని తినడం మంచిది కాదు. ఇది కడుపు సంబంధ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి గర్భస్రావానికి దారితీస్తుంది. బొప్పాయి తినడానికి సరైన సమయం ఖాళి కడుపుతో తీసుకోవచ్చు. పగటిపూట తీసుకోవచ్చు. ఎవరైనా విరోచనాల సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండును కొన్ని రోజులు తినడం మానేస్తే మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి