Cervical-Cancer.

మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య గర్భాశయవాపు. దీని ద్వారా గర్భశయంలో కనుతులు ఏర్పడతాయి. పిసిఒఎస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. మోనోపాజ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భాశయవాపు లక్షణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపునొప్పి: మహిళల్లో గర్భాశయవాపు కారణంగా కడుపునొప్పి మరియు వెన్నునొప్పి ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కొక్కసారి తీవ్రంగా ఉండవచ్చు చాలా కాలం పాటు కూడా ఉన్నట్లయితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.

అధిక రక్తస్రావం: ఒకవేళ మీరు గర్భాశయవాపుతో బాధపడుతున్నట్లయితే మీకు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం అవుతుంది. చాలామంది ఈ విషయాన్ని అంతగా గమనించకపోవచ్చు. కానీ ఈ లక్షణం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.

మూత్ర విసర్జన సమయంలో నొప్పి:  గర్భాశయవాపు ఉన్న మహిళల్లో మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇది వాపు ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతం కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది.

ఇర్  రెగ్యులర్ పీరియడ్స్ : గర్భాశయం వాపుకి ఇంకొక సంకేతం మీ పిరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సకాలంలో రాకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Health Tips: కీటో డైట్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు

పెల్విక్ పెయిన్: కటి ప్రాంతంలో ఎక్కువ తిమ్మిరిగా ఉంటుంది గర్భస వాపు ఉన్నవారికి ఈ సమస్య ఏర్పడుతుంది.

తగ్గించే మార్గాలు.

బార్లీ: బార్లీ గింజలను జాబలాగా చేసుకుని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీ గర్భాశయవాపు తగ్గిపోతుంది. బార్లీలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉండడం ద్వారా ఇవి గర్భాశయం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

శతవారి: ఆయుర్వేదంలో శతవారికి అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల సమస్యలను తగ్గించడంలో ఇది ప్రసిద్ధి చెందింది. ఇది మహిళల్లో వచ్చే అనేక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భాశయ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

వేడి ఆహార పదార్థాలు తీసుకోవద్దు:   గర్భాశయ వాపు ఉన్నవారు వేడి పదార్థాలను తీసుకోవడం మంచిది కాదు. ఇది గర్భాశయ వాపు సమస్యను మరింతగా పెంచి పిరియడ్స్ పైన ప్రభావితాన్ని చూపిస్తుంది. అందువల్ల అధిక వేడి ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. అంతేకాకుండా సరైన సమయంలో చికిత్స పొందడం కూడా చాలా ముఖ్యం. ఈ లక్షణాలలో ఏదైనా మీరు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులతో సంప్రదించి సరైన చికిత్సను పొందండి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.