Health Tips: విటమిన్ ఎ ఉపయోగాలు..విటమిన్ ఎ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుసా..

అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది.

carrot

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాలైనటువంటి పోషకాలు అవసరం . అందులో ఖనిజాలు రొటీన్లు విటమిన్లు చాలా ముఖ్యమైనవి. అయితే విటమిన్ ఎ మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది చాలా సహకరిస్తుంది. విటమిన్ ఎ లోపం వల్ల కూడా మనకు ఎలాంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విటమిన్ ఎ పాత్ర- విటమిన్ ఏ మన శరీరానికి కావాల్సిన కీలకమైన విటమిన్ ఇది మన శరీర సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా విటమిన్ ఎ వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీర కణాలను నిర్మాణం అవ్వడానికి ఎముకలకు మంచిది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా విటమిన్ ఎ ఉపయోగపడుతుంది.

విటమిన్ ఎ లోపం వల్ల వచ్చే జబ్బులు.

కంటి చూపు సమస్య- విటమిన్ ఏ లోపం వల్ల మన కంటి చూపు తగ్గుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. కొంతమందిలో విటమిన్ ఎ లోపం వల్ల రాత్రి పూట కనపడదు. విటమిన్ ఎ లోపం వల్ల ఒక్కొక్కసారి జీవితాంతం కూడా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది- విటమిన్ ఎ లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ ఎ శరీరంలో తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది తక్కువగా ఉన్నప్పుడు త్వరగా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి తగ్గడం ద్వారా త్వరగా జబ్బు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.

కణ నిర్మాణం- విటమిన్ ఎ లోపం వల్ల మన శరీరంలో కొత్త కణాలు ఏర్పడవు. ఈ విటమిన్ లోపం వల్ల మన శరీరంలో ఊపిరితిత్తుల సమస్య పేగుల్లో ఇన్ఫెక్షన్ వంటి సమస్య ఏర్పడతాయి. అవయవాల పనితీరులో కూడా తేడాలు చూపిస్తుంది. విటమిన్ ఎ మన చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గర్భధారణ సమస్యలు- విటమిన్ ఎ లోపం వల్ల ఒక్కొక్కసారి గర్భిణీలలో గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కడుపులో శిశువుల అవయవాల పెరుగుదలలో సమస్యలు వస్తాయి. ఈ విటమిన్ లోపం వల్ల పురుషుల్లో ,స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గుతుంది.

విటమిన్ ఏ లోపం యొక్క లక్షణాలు

కంటి చూపు తగ్గడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలిపోవడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, తరచుగా జబ్బులు రావడం, కళ్ళ కింద నల్లటి మచ్చలు ఏర్పడడం వంటివి ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు.

విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహారాలు.

క్యారెట్- క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీని ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఏ విటమిన్ లోపం తగ్గుతుంది.

పాల ఉత్పత్తులు- పాలు, పెరుగు, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా ఏ విటమిన్ లోపం తగ్గుతుంది.

పండ్లు-  మామిడిపండు, అరటిపండు, అవకాడో, వంటి వాటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా విటమిన్ ఎ లోపం నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి