Kidney Representative Inage

కిడ్నీలు మానవ శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది మన శరీరంలోని రక్తంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. అయితే మూత్రపిండాల వైభవం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మూత్రపిండాలు వైఫల్యానికి కారణాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తే మీకు కిడ్నీలు ప్రమాదంలో ఉన్నట్టే.

మూత్రంలో నురగ- మీ మూత్రంలో కనిపిస్తే అది మూత్రపిండాల వాయిస్ పెట్టడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న రోగుల్లో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. వీరి మూత్రంలో ప్రోటీన్ లీక్ అవుతుంది. ఈ లక్షణాన్ని చాలామంది విస్మరిస్తా ఉంటారు. కానీ ఇది వెంటనే డాక్టర్కు చూపించకపోతే తీవ్ర సమస్యగా దారితీస్తుంది.

తరచుగా మూత్ర విసర్జన- చాలామంది పగటిపూట కంటే రాత్రిపూట ఎక్కువ మూత్ర విసర్జన జరిగితే అది కిడ్నీ సమస్యకు సంకేతంగా కూడా చెప్పవచ్చు. కిడ్నీలు టాక్సిన్స్ లను సరిగ్గా ఫిల్టర్ చేయకపోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జన వెళ్లాల్సి వస్తుంది. షుగర్ పేషెంట్లో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు.

కాళ్లు, చేతుల్లో వాపు- కిడ్నీ ఫెయిల్యూర్స్ కారణంగా మన శరీరంలో చెడు పదార్థాలు ఎక్కువగా పేరుకుపోతాయి. ఇది ముఖ్యంగా కాళ్లు చేతులు వాక్కుకు కారణం అవుతుంది. అయితే దీన్ని చాలా మంది బరువు పెరిగారని అనుకుంటారు. కానీ ఇది మూత్రపిండాల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు.

Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా

కాళ్లు తిమ్మిర్లు- కార్ల తిమ్మిర్లతో బాధపడుతుంటారు. అయితే ఇది మూత్రపిండాల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు. వీరి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.

నీరసం- కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మన శరీరంలో తీవ్ర నీరసం అలసట బలహీనత కనిపిస్తుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోను విడుదల చేస్తాయి. వీటివల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే ముఖ్యంగా రక్తహీనత బలహీనత శరీరం పాలిపోవడం వంటి సంకేతాలు కూడా కనిపిస్తాయి.

కిడ్నీ సమస్యలను ఎలా నివారించాలి- మీకు పైన చెప్పిన లక్షణాలు గాని ఏవైనా గమనించినట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. తద్వారా వారి మూత్రపిండాల పనితీరును సకాలంలో మనం గుర్తించినట్లయితే తొలి దశలోనే నియంత్రించవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.