Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రాగల రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిన వాతావరణ శాఖ

కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది...

Representational Image | Photo Credits : IANS.

Hyderabad, September 18:  ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని ఆనుకొని నైరుతి దిశగా పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ద్రోణి ప్రభావం తెలంగాణ, మహారాష్ట్రపై కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం నుంచి వర్షపాతం తగ్గుతుందని పేర్కొన్నారు.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపిలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెపుతుంది. రాయలసీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ఈ ఆవర్తనం మరింత బలపడి తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవుల నుంచి ఒడిశా వైపుగా ఈ గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.



సంబంధిత వార్తలు

Cyclone Fengal: ఏపీకి ఫెంగల్ తుఫాను ముప్పు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తీరం వెంబడి గంటకు 75 కిలో మీటర్ల వేగంతో గాలులు, నేడు తమిళనాడును తాకనున్న సైక్లోన్

Cyclone Fengal: తమిళనాడు వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను, స్కూళ్లకు సెలవులు ప్రకటించిన స్టాలిన్ సర్కారు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్