Heavy Rains In India: దేశాన్ని వణికిస్తున్న వర్షాలు, నాలుగు రోజుల్లో 110 మందికి పైగా మృత్యువాత, అత్యధికమంది ఉత్తరప్రదేశ్‌లోనే, అస్తవ్యస్తంగా మారిన జనజీవనం, ఆరోగ్యశాఖపై తీవ్ర ప్రభావం
భారీ వర్షాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రుతుపవనాల తిరోగమనం తీవ్రంగా ఆలస్యం కావడంతో దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా వరదలు ముంచెత్తుతున్నాయి.
Uttar Pradesh, September 30: రుతుపవనాల తిరోగమనం దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. భారీ వర్షాలతో దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రుతుపవనాల తిరోగమనం తీవ్రంగా ఆలస్యం కావడంతో దేశంలో నార్త్ నుంచి సౌత్ దాకా వరదలు ముంచెత్తుతున్నాయి. నాలుగు రోజులుగా దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు ఉత్తరప్రదేశ్ వారు కాగా, ఎడతెగని వానలతో బిహార్ రాజధాని పాట్నాలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.పాట్నాలోని చాలా ప్రాంతాల్లో నడుము లోతు వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు నివాస ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నిత్యావసరాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. రాష్ట్రంలో గత 48 గంటల్లో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో 18 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. దాదాపు 200 మిల్లీమీటర్ల పైనే వర్షం కురిసింది. జలదిగ్బంధనంలో బిహార్, భారీ వర్షాలతో అతలాకుతలం
పాట్నాలో వరదలు
పాట్నా, దనపూర్ తదితర రైల్వే స్టేషన్లు వరదల్లో చిక్కుకుపోవడంతో రైల్వే శాఖ 30 రైళ్లను రద్దు చేసింది. కొన్ని విమానసర్వీసులను కూడా దారి మళ్లించారు. ఇదాలి ఉంటే జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పొంగిపొర్లుతున్న నదిలో బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పరితోష్ మండల్ కొట్టుకుపోయారు. 36వ బెటాలియన్‌కు చెందిన మండల్ కోసం అధికారులు గాలిస్తున్నారు. రెండు రోజులు రోడ్ల పైకి ఎవరూ రావద్దు, నగర వాసులకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్
నలందా మెడికల్ కాలేజీ పాట్నా
ఉత్తర ప్రదేశ్ లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 70మందికిపైగా మృతి చెందారు. వర్షాలు, వరద, సహాయక చర్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ప్రకటించారు. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమకుండ్ సాహెబ్‌కు వెళ్తున్న యాత్రికుల వాహనంపై భారీ బండరాయి జారిపడటంతో ఆరుగురు మృతి చెందారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల చివరి వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆరోగ్యశాఖపై కూడా వర్షం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.