JNU Violence: దాడి చేసింది మేమే, యూనివర్సిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటేనే దాడి చేసాం, ప్రకటించిన హిందూ రక్షా దళ్, దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ వీడియోను విడుదల చేసిన సంస్థ చీఫ్ పింకీ చౌదరీ
యూనివర్శిటీలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నందునే దాడి చేశామని ఆ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ(Pinky Chaudhary) ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం యూనివర్శిటి కమ్యూనిజం-సంబంధిత కార్యకలాపాల కేంద్రంగా మారింది.
New Delhi, January 07: ఈ నెల 5న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటిలో( Jawaharlal Nehru University (JNU)) ఉపాధ్యాయులు, విద్యార్థులపై దాడికి పాల్పడింది తమ కార్యకర్తలేనని హిందూ రక్షా దళ్(Hindu Raksha Dal) ప్రకటించింది. యూనివర్శిటీలో జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నందునే దాడి చేశామని ఆ సంస్థ చీఫ్ పింకీ చౌదరీ(Pinky Chaudhary) ట్విటర్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం యూనివర్శిటి కమ్యూనిజం-సంబంధిత కార్యకలాపాల కేంద్రంగా మారింది.
వారు మా మతాన్ని, దేశాన్ని దూషిస్తున్నారు. ఇది సహించరానిది” అని పింకీ ఆ వీడియోలో తెలిపాడు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తలపెడితే తాము భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. మా మతం, దేశం అగౌరవానికి గురవుతుంటే, చూస్తూ ఎలా మౌనంగా ఉంటాం?” అని పింకీ ప్రశ్నించాడు.
మరోవైపు జేఎన్‌యూ క్యాంపస్‌లో ఇనుప రాడ్‌లతో వీడియోలో కనిపించిన సాయుధ దుండగులు ఇద్దరు ఆరెస్సెస్‌కు చెందిన విద్యార్థి సంఘ నేతలేనని ఏబీవీపీ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి అనిమా సోంకర్ అంగీకరించిన నేపథ్యంలో ఈ ట్విటర్ వీడియో వెలుగుచూడటం గమనార్హం.
Here's Pinky video
జేఎన్‌యూ విద్యార్ధులు(JNU Students) ఈ దేశంలో నివసిస్తూ ఇక్కడి తిండి తింటూ వర్సిటీలో చదువుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. జేఎన్‌యూ దాడి ఘటనలో పాల్గొన్నది తమ కార్యకర్తలేనని, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.మరోవైపు తోమర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ముసుగు దుండగులను గుర్తించేందుకు వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Here's ANI Tweet
ఇదిలా ఉంటే జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలైన ఐషే ఘోష్ యూనివర్శిటీలోని సర్వర్ రూంతోపాటు వర్శిటీ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిందని వర్శిటీ యాజమాన్యం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐషే ఘోష్(Aishe Ghosh)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి ఘటనకు ముందు రోజు అంటే జనవరి 4వతేదీన ఐషే ఘోష్ తోపాటు 19 మంది సర్వర్ రూంపై దాడి చేసి సెక్యూరిటీ గార్డులను కొట్టారని యూనివర్శిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
ముసుగులు ధరించిన 50 మందికి పైగా దుండగులు వర్సిటీ ప్రాంగణంలోని సబర్మతి, మహిమాండ్వి, పెరియార్ హాస్టళ్లలోకి చొరబడి లాఠీలు, రాడ్లు, సుత్తులతో విధ్వంసం సృష్టించి, అధ్యాపకులపై, విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ తల పగిలింది. ఆమె ముఖం నుంచి రక్తం తీవ్రంగా స్రవించింది. ఈ ఘటనలో 30మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెసర్లు కూడా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశార్జ్ అయ్యారు.
గుజరాత్ లో వయెలెన్స్
దాడిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు గాయపడినా వర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎం జగదీష్ కుమార్ కనీసం పరామర్శించలేదని, వీసీ రాజీనామా చేయాలని ఐషేఘోష్ డిమాండ్ చేశారు. హాస్టల్ ఫీజు పెంపుకు వ్యతిరేకంగా విద్యార్ధుల ఉద్యమానికి భంగం కలిగించటానికి వర్శిటీ యాజమాన్యం ఇటువంటి కేసులు పెడుతోందని ఘోష్ విమర్శించారు.