Indira Park (Credits: X)

Hyderabad, Feb 15: ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులకు అదొక పండుగ రోజు. వాలంటైన్స్ డే వేళ.. ఎంతో మంది కొత్త ప్రేమికులు కలిసిపోతుంటారు. మరెన్నో ప్రేమ జంటలు తమ ప్రేమను సెలెబ్రేట్ చేసుకుంటాయి. తమ ప్రేమను జీవితాంతం గుర్తుండిపోయేలా రకరకాల ప్రొగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. ఈ క్రమంలో నిత్యం ప్రేమికులు, సందర్శకులతో కళకళలాడే ఇందిరాపార్కు(Indira Park) వాలెంటైన్స్‌ డే (ప్రేమికుల రోజు) శుక్రవారం రోజున మరింత రద్దీగా ఉంటుందని భావిస్తే, దానికి భిన్నంగా నిన్న శుక్రవారం నాడు పార్కు పూర్తిగా బోసిపోయింది. వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌(VHP, Bajrang Dal) నాయకులు, కార్యకర్తలు పార్కుకు వచ్చే ప్రేమ జంటలకు ఇబ్బంది కలిగిస్తారని పోలీసులు భావించారు. పార్కులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులతో చర్చించిన పోలీసులు.. ముందస్తుగా పార్కు గేట్లకు తాళాలు వేసి మూసివేయించారు. అందుకే పార్కు బోసిపోయినట్టు తెలుస్తోంది.

తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?

పెళ్లిళ్లు ఏమీ చేయబోం

వాలంటైన్స్ డే వేళ తామేమి పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు పెట్టుకోలేదని బజరంగ్ దళ్ కార్యకర్తతెలిపారులు తాజాగా . ఫిబ్రవరి 14 అంటే పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుని వీర జవాన్ దివస్‌ గా నిర్వహించడమే తమ లక్ష్యమని బజరంగ్ దళ్ నేతలు స్పష్టం చేశారు. ప్రేమికుల రోజున బ్యాన్ వాలెంటెన్స్ డే - ప్రమోట్ వీర జవాన్ దివస్ అంటూ నినాదాన్ని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ నేతలు ఇస్తున్నారు.

మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు