Amit Shah Slams Mallikarjun Kharge: మోదీని ప్రధాని పదవి నుంచి దించేవరకు చనిపోను, మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు, కౌంటర్ విసిరిన హోమంత్రి అమిత్ షా
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేవరకు చనిపోనని చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
New Delhi, Sep 30: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేవరకు చనిపోనని చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పు పట్టారు.
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ‘కశ్మీర్‌లో ఖర్గే చేసిన వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి. ఖర్గే హుందాతనంగా వ్యవహరిస్తారని భావించా. ఆయన ఇతర కాంగ్రెస్ నేతల మాదిరిగా మాట్లాడారు. మోదీపై కాంగ్రెస్ నాయకులకు ఉన్న ద్వేషం ఆ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఆ పార్టీ నేతలకు మోదీ గురించి ఆలోచించడం తప్ప మరో ఆలోచన లేదు అని’ అమిత్ షా మండిపడ్డారు. అనారోగ్యానికి గురయిన ఖర్గే కోలుకోవాలని నేను, మోదీ కోరుకున్నాం. ఆరోగ్యంతో ఉండాలని అందరం ప్రార్థిద్దాం. ఖర్గే మరికొన్ని ఏళ్లు జీవించాలి. 2047లో వికసిత్ భారత్‌ను ఖర్గే కళ్లారా చూడాలి అని అమిత్ షా పేర్కొన్నారు.
కశ్మీర్‌లో గల జస్ రోటాలో జరిగిన ర్యాలీలో ఖర్గే పాల్గొని ప్రసంగించారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్దరించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తన వయస్సు 83 ఏళ్లు అని.. అప్పుడే తాను చనిపోనని తెలిపారు. మోదీని ప్రధాని పదవి నుంచి దింపేవరకు రాజకీయాల్లో ఉంటానని స్పష్టం చేశారు. అస్వస్థతకు గురై.. చికిత్స తీసుకున్నారు. తర్వాత ఉద్వేకంగా మాట్లాడారు.