Beggars Should Work For Country: ఆశ్రయంలేని వాళ్లు, బిచ్చగాళ్లు దేశం కోసం పని చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను వాళ్లకు కల్పించలేదు, పబ్లిక్ టాయిలెట్లను ఉచితంగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన బాంబై హైకోర్టు
వీరంతా దేశం కోసం పనిచేయాలని (Homeless, Beggars Should Work For the Country), రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించలేదని ఓ కేసు విచారణ సందర్భంగా ఇవాళ బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది.
Mumbai, Jul 3: ఆశ్రయంలేని వాళ్లు, బిచ్చగాళ్లపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీరంతా దేశం కోసం పనిచేయాలని (Homeless, Beggars Should Work For the Country), రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించలేదని ఓ కేసు విచారణ సందర్భంగా ఇవాళ బాంబే హైకోర్టు (Bombay High Court) అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా అనాథలు, బిచ్చగాళ్లకు మూడు పూటల పోషకాలతో కూడిన ఆహారాన్ని, శుద్దమైన తాగునీటి, క్లీన్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని బ్రిజేశ్ ఆర్య అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎన్జీవోల సాయంతో అనాథలు, బిచ్చగాళ్లకు ఆహార పొట్లాలను సరఫరా చేస్తున్నామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కోర్టుకు చెప్పింది. మహిళలకు శానిటరీ నాప్కిన్లు ఇస్తున్నట్లు కూడా ఎంబీసీ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా ముంబై అత్యున్నత ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని, నిరాశ్రయులు కూడా దేశం కోసం పనిచేయాలని అన్నీ రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వదని, ఇలా చేయడం వల్ల ఆ సెక్షన్ జనాభాను పెంచుతున్నట్లు అవుతుందని పేర్కొన్నది.
పిటిషన్‌లో పేర్కొన్న అంశాలన్నింటినీ ప్రభుత్వం తీరిస్తే అప్పుడు ఇక వాళ్లు ఏమీ పనిచేయలేరని కోర్టు వెల్లడించింది. ఇండ్లు లేని వాళ్లకు పబ్లిక్ టాయిలెట్లను ఉచితంగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌లో నిరాశ్రయులు ఎవరన్న అంశం సరిగా లేదని, ఎంత మందికి నగరంలో ఇండ్లు లేవన్న విషయాన్ని కూడా పేర్కొనలేదని ధర్మాసనం అభిప్రాయపడింది.