ఉత్తరప్రదేశ్‌లో శనివారం 53 స్థానాల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన జడ్పీ సభ్యులంతా ఐక్యతతో ఉండాలని కోరుతూ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, చందౌలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన రామ్‌కిషన్‌ యాదవ్‌, పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కారు. అంతా కలిసి ఉండి పార్టీ అభ్యర్థిని జడ్పీ ఛైర్‌పర్సన్‌గా గెలిపించాలని కోరారు. రామ్‌కిషన్‌ మేనల్లుడు తేజ్‌ నారాయణ్‌ యాదవ్‌ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మేనల్లుడి గెలుపు కోసం రామ్‌కిషన్‌ పార్టీ సభ్యుల కాళ్లకు మొక్కారు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అయితే పార్టీ గౌరవం, గెలుపు కోసం ఎవరి కాళ్లకైనా తాను మొక్కుతానని రామ్‌కిషన్‌ యాదవ్‌ అన్నారు.

Here's Viral Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)