Karnataka Ambulance Crash: ఇంత దారుణమైన యాక్సిడెంట్ చూసి ఉండరు! ఆవుదూడను తప్పించబోయి టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన అంబులెన్స్, ఎగిరిపడ్డ రోగి, ఇద్దరు అటెండెంట్లు స్పాట్ లోనే మృతి, ఒళ్లుగగుల్పొడింపిచేలా ఉన్న దృశ్యాలు
అంతోనే అదుపు తప్పిన అంబులెన్స్ టోల్ బూత్ ను ఢీకొట్టింది. దాంతో అంబులెన్స్ లోని పేషెంట్, అతని అటెండెంట్లు ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో (CCTV) రికార్డయ్యాయి. అంబులెన్స్ హోనావర నుంచి ఖుందాపురకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Udipi, July 20: కర్ణాటక లోని ఉడిపి (Udupi) వద్ద ఘోర ప్రమాదం జరిగింది. షిరూర్ వద్ద టోల్ ప్లాజా (Toll plaza) బూత్ లోకి అంబులెన్స్ దూసుకెళ్లింది. దాంతో అంబులెన్స్ (Ambulance) లోని పేషెంట్ తో పాటూ…ఇద్దరు అటెండెంట్లు, డ్రైవర్ స్పాట్ లోనే చనిపోయారు. టోల్ ప్లాజా వద్ద స్పీడ్ వద్ద దూసుకొచ్చిన అంబులెన్స్ ను చూసి….సిబ్బంది బారికేడ్లను తొలగించారు. అంతోనే అదుపు తప్పిన అంబులెన్స్ టోల్ బూత్ ను ఢీకొట్టింది. దాంతో అంబులెన్స్ లోని పేషెంట్, అతని అటెండెంట్లు ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో (CCTV) రికార్డయ్యాయి. అంబులెన్స్ హోనావర నుంచి ఖుందాపురకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్ణాటకలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. రోగిని తీసుకొని వేగంగా దూసుకొస్తున్న ఓ అంబులెన్స్ అదుపుతప్పి టోల్‌ప్లాజాను ఢీకొన్న ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారాయి. సైరన్ మోగిస్తూ దూసుకొస్తున్న అంబులెన్స్‌ను దూరం నుంచే గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది.. రోడ్డుకు అడ్డంగా ఉన్న ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి బారికేడ్లను తొలగించగా.. టోల్ బూత్ వద్ద ఉన్న బారికేడ్‌ను (barricade) మరో వ్యక్తి తొలగిస్తుండగానే ప్రమాదం చోటుచేసుకుంది.
అక్కడే ఉన్న ఓ ఆవుదూడను తప్పించబోయే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం, దీనికితోడు రోడ్డుపై వర్షపు నీరు ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు మరికొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బారికేడ్లను తొలగిస్తున్న వ్యక్తి వాహనానికి, బూత్‌కు మధ్య నలిగిపోయాడు. అంబులెన్స్ వేగం ధాటికి అందులో ఉన్న రోగి, బంధువులు చెల్లాచెదురుగా పడిపోవడం వీడియోలో కనిపిస్తోంది.