Chandigarh University Video Leak: 60 మంది విద్యార్ధినిల ప్రైవేట్‌ వీడియోలు లీక్‌, చండీగఢ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఆందోళన, మొహాలీలో గందరగోళం, పలువురు విద్యార్ధినులు ఆత్మహత్యాయత్నం చేశారంటూ పుకార్లు, ఒక్కరి వీడియో మాత్రమే లీక్‌ అయ్యిందంటూ పోలీసుల ప్రకటన

వర్సిటీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఒక విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్‌ చేసిన ఒక పర్సనల్‌ వీడియో తప్పితే మరే ఇతర విద్యార్థినికి చెందిన అభ్యంతరకర వీడియోలూ దొరకలేదు.

Mohali, SEP 18: పంజాబ్‌ మొహాలీలోని చండీగఢ్‌ వర్సిటీలో (Chandigarh University) కొందరు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు (obscene videos) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా (Viral videos) మారాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విద్యార్థినుల ఆందోళనలతో వర్సిటీ అట్టుడుకుతోంది. ఓ విద్యార్థిని తన సహచరుల ప్రైవేటు వీడియోలను (obscene videos) వేరే యూనివర్సిటీకి చెందిన స్నేహితుడికి పంపగా.. అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసినట్టు గుప్పుమన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. పలువురు విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయంటూ వస్తోన్న ఆరోపణల్ని యూనివర్సిటీ అధికారులు, పోలీసులు ఖండిస్తున్నారు. అవన్నీ అవాస్తవాలేనని.. ఒక విద్యార్థిని తన సొంత వీడియోను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో షేర్‌ చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు చెబుతున్నారు. అయితే, ఆ విద్యార్థినిని ఇప్పటికే అరెస్టు చేసినట్టు మొహాలీ సీనియర్‌ ఎస్పీ వివేక్‌ శీల్‌ సోనీ తెలిపారు. నిందితురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు.

విద్యార్థినుల పర్సనల్‌ వీడియోలు లీక్‌ (Video Leak) అయినట్టు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టుల్ని కొట్టిపారేశారు. ఆ నిందితురాలు ఎవరికైతే వీడియో పంపిందో అతడిని కూడా అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందం సిమ్లాకు వెళ్లినట్టు ఏడీజీపీ గుర్‌ప్రీత్‌ కౌర్‌ దేవ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన తమ దర్యాప్తులో నిందితురాలు ఒకే ఒక్క వీడియోను (Video) మాత్రమే గుర్తించినట్టు చెప్పారు. ఆమె ఇంకెవరి వీడియోలనూ రికార్డు చేయలేదని పోలీసులు స్పష్టంచేశారు. వర్సిటీలో పలు ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం పంపనున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ వీడియోల వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో విద్యార్థినులు ఎవరూ ఆత్మహత్యకు ప్రయత్నించలేదని.. ఎవరూ రూమర్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక విద్యార్థిని ఆందోళనకు గురై కుప్పకూలగా ఆమెను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు.

Jharkhand Shocker: లక్ష రూపాయల లోన్‌ కట్టలేదని గర్బిణిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు, జార్ఖండ్‌లో రికవరీ ఏజెంట్ అరాచకం, ట్రాక్టర్ తీసుకువెళ్లకుండా అడ్డుకున్నందుకు దారుణం 

‘‘వర్సిటీలో విద్యార్థినులకు చెందిన 60 అభ్యంతరకర ఎంఎంఎస్‌లు వచ్చాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. వర్సిటీ నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఒక విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌కు షేర్‌ చేసిన ఒక పర్సనల్‌ వీడియో తప్పితే మరే ఇతర విద్యార్థినికి చెందిన అభ్యంతరకర వీడియోలూ దొరకలేదు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను పోలీస్‌ శాఖకు అప్పగించాం. అన్ని మొబైల్‌ ఫోన్లు, ఇతర మెటీరియల్‌ను పోలీసులకు అందజేశాం’’ అని చండీగఢ్‌ వర్సిటీ ప్రో వైస్‌ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ బవా ఓ ప్రకటనలో వెల్లడించారు.

Jharkhand Bus Accident: జార్ఖండ్‌లో ఘోరప్రమాదం, ఏడుగురు మృతి, పలువురికి గాయాలు, రెయిలింగ్‌ ఉంటే ప్రమాదం జరిగేదే కాదు, సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సీఎం హేమంత్ సోరెన్ 

చండీగఢ్‌ వర్సిటీలో చోటుచేసుకున్న ఘటన గురించి విని బాధేసిందని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) అన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మన ఆడపిల్లలు మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. తప్పుచేసిన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. నిరంతరం అధికారులతో టచ్‌లో ఉంటానని.. ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.