HC on Divorce Case: భార్య నల్లగా ఉందని భర్త విడాకులు అడిగితే ఇవ్వలేం, రంగు విషయంలో మానవ ధృక్పథం మారాలని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు

మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Chhattisgarh High Court (Photo Credits: Wikimedia Commons)

భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2005లో వివాహమైన సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా తన భార్య తనను విడిచి వెళ్లినట్లు భర్త వాదించాడు. అయితే తన నలుపు రంగు కారణంగా భర్త వేధింపులకు గురిచేసినట్లు, ఇంటి నుంచి గెంటేసినట్లు భార్య తెలిపింది. దీంతో ఆమె తరపున నిలిచిన న్యాయస్థానం భర్తకు చివాట్లు పెట్టింది.

మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో పాట్నా హైకోర్టు సంచలన తీర్పు, స్నిఫర్ డాగ్ సాక్ష్యాల ఆధారంగా మరణశిక్ష విధించిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు

ఈ కేసులో తీర్పు ద్వారా ఇతరులు కూడా చర్మ రంగు ఆధారంగా ఎంపిక చేసుకునే మనస్తత్వాన్నిప్రోత్సహించలేమని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది.